కృష్ణ

ఘనంగా గణతంత్ర దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 26: రాష్ట్ర విభజన అనంతరం వరుసగా రెండో దఫాగా స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం జరిగిన 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ తెలంగాణ రాష్ట్రంలో కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాల్సి వుండటంతో తెల్లవారుఝాము నుంచే సభా ప్రాంగణంలో సందడి నెలకొంది. దాదాపు 250 బస్సుల్లో 15వేల మంది పైగా విద్యార్థులను ఉదయం 6గంటలకల్లా తరలించటం జరిగింది. గ్యాలరీలో మొదటి అంతస్తును ఎంతో ఆకర్షణీయంగా జాతీయ జెండాను పోలిన మూడు రంగులతో తీర్చిదిద్దారు. అలాగే ఆ గ్యాలరీలో కూర్చున విద్యార్థులు కాషాయం, తెలుపు, పచ్చని దుస్తులు ధరించి కూర్చోటంతో సభా ప్రాంగణానికి ప్రత్యేక ఆకర్షణ వచ్చినట్లయింది. ఈ వేడుకలను తిలకించేందుకు నగరవాసులు సైతం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సరిగ్గా 7గంటలకు పెరేడ్‌లో పాల్గొనే బృందాలు ఒకదాని వెంట ఒకటిగా ప్రాంగణంలోకి చేరుకోవటం ప్రారంభమైంది. 7.36ని.లకు డిజిపి జెవి రాముడు, 7.38కు ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, 7.40ని.లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, 7.42కు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రాంగణానికి చేరుకున్నారు. శకటాల ప్రదర్శన, వివిధ బృందాల కవాతు ప్రదర్శనలు ఆసక్తి రేపటంతో పాటు నగరానికి నూతన శోభను చేకూర్చటం జరిగింది. కవాతు ప్రదర్శనలోను, శకటాల ప్రదర్శనలోనూ విజేతలను ఎంపిక చేసేందుకు గాను శకటాల విభాగంలో స్వా కాలేజీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.రమేష్, ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఇ.శివనాగిరెడ్డి, జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావు, కవాతు ప్రదర్శనల విభాగంలో ఐపిఎస్ అధికారులు నార్త్ పోస్టల్ రీజియన్ ఐజిపి కుమార్ ఈశ్వర్‌జిత్, అతుల్‌సింగ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. శకటాల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన వ్యవసాయశాఖ శకటం తరుపున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి టి.విజయకుమార్, ద్వితీయ స్థానంలో నిలిచిన టిటిడి శకటం తరుపున ఇఇ ఎస్.సుధాకర్‌రావు, మూడో స్థానంలో నిలిచిన సిఆర్‌డిఎ శకటం తరఫున నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్, కవాతు ప్రదర్శనల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన ఇండియన్ ఆర్మీ సాయుధ దళాల బృందం తరఫున సుబేదార్ కమల్ కిషోర్, నాన్ ఆర్మ్‌డ్ విభాగంలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందం తరపున పైడిపాముల రమ్యతేజ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ చేతుల మీదుగా జ్ఞాపికలందుకున్నారు.
ఈ వేడుకల్లో ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్, మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, జడ్‌పి చైర్‌పర్సన్ గద్దె అనురాధ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వేడుకలు విజయవంతం కావటంలో కలెక్టర్ బాబు.ఎ, పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్‌ల కృషి విజయవంతమైంది.
కవాతులో మొదటి వరుసలో భారత సైనిక దళం, సాయుధ దళాల బృందం ముందుకు కదిలింది. సుబేదార్ కమల్ కిషోర్ కంటింజెంట్ కమాండర్‌గా వ్యవహరించారు. హైదరాబాద్‌లో 1962లో ఆవిర్భవించిన ఆర్టిలరీ కేంద్రం భారత సైనికులకు అత్యుత్తమ సైనికులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన శిక్షణ ఇస్తున్నది. రెండో వరుసలో కదిలిన కేంద్రీయ రిజర్వ్ పోలీస్ బలగానికి సిఆర్‌పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రాకేష్‌కుమార్ మిశ్రా కమాండర్‌గా వ్యవహరించారు.
నగర వీధుల్లో శకటాల ప్రదర్శన
కార్యక్రమం అనంతరం శకటాలన్నీ ఒకదాని వెంట ఒకటిగా మున్సిపల్ స్టేడియం నుంచి బెంజిసర్కిల్, నిర్మలా కానె్వంట్ జంక్షన్, రామవరప్పాడు సర్కిల్, గుణదల, చుట్టుగుంట, గవర్నర్‌పేట మీదుగా పాత బస్టాండ్ నుంచి తిరిగి రాఘవయ్య పార్కు మీదుగా స్టేడియంకు చేరుకున్నాయి. అగ్నిమాపకకు చెందిన శకటం అగ్రస్థానంలో నిలువగా తదుపరి తిరుమల తిరుపతి దేవస్థానం విశిష్టత, భక్తులకు అందిస్తున్న స్వామివారి సేవల వివరాలను తెలుపుతూ ప్రదర్శించిన శకటం, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో లాభసాటి వ్యవసాయంతో కరువు రహిత రాష్ట్రం, సేంద్రీయ వ్యవసాయంపై రూపొందించిన శకటం, పౌరసరఫరాల శాఖ ఈ-పోస్ విధానం, ఆదారం అనుసంధానం, నిత్యావసరాల పంపిణీపై రూపొందించిన శకటం, గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయ ఉపాధి హామీ పథకం, అంశాలతో రూపొందించిన శకటం, సిఆర్‌డిఏ ఆధ్వర్యంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంపై రూపొందించిన శకటం, జలవనరులశాఖ నదుల అనుసంధానం, పట్టిసీమ, పోలవరం తదితర ప్రాజెక్టుల నిర్మాణంపై రూపొందించిన శకటం, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్‌పై రూపొందించిన శకటం, మహిళా సాధికారిత, అన్న సంజీవని, జనరిక్ మందులు వంటి అంశాలతో రూపొందించిన శకటం, సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో విద్యా ప్రాముఖ్యత, విద్యారంగ అభివృద్ధిపై రూపొందించిన శకటాలతో పాటు తొలిసారిగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓటు నమోదు, ఓటు ప్రాముఖ్యత, ఓటు హక్కు వినియోగం తదితర అంశాలతో రూపొందించిన శకటం నగర వీధుల్లో ప్రదర్శించారు. శకటాలపై ఆయా శాఖలకు చెందిన లైవ్ మోడల్స్ ప్రదర్శించిన ప్రదర్శనలు ప్రజలు ఆసక్తిగా తిలకించారు. శకటాల ప్రదర్శనను ఆయా శాఖలకు చెందిన అధికారులు, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు పర్యవేక్షించారు.

అభివృద్ధి, ఐక్యతకు ప్రాధాన్యం
* ఎస్‌సి రైల్వే జిఎం రవీంద్రగుప్తా
* రైల్వే మినీ స్టేడియంలో 67వ గణతంత్ర వేడుకలు
* జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన డిఆర్‌ఎం
విజయవాడ, (రైల్వే స్టేషన్), జనవరి 26: 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైల్వే మినీ స్టేడియంలో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ అశోక్‌కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. అనంతరం ఆర్‌పిఎఫ్, భారతీయ రైల్వే స్కౌట్స్ అండ్ గైడ్స్, రైల్వే మిక్సిడ్ హైస్కూల్ విద్యార్థులు ఇచ్చిన గౌరవాన్ని పొందారు. తరువాత దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ఇందులోని ప్రధానంగా ముందుగా 67వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రైల్వే కార్మికులకు, వారి కుటుంబ సభ్యులతోపాటు ప్రయాణికులకు శుభాభినందనలు తెలిపారు. భారతీయ రైల్వేలోని ఒకటిగా పేరొందిన దక్షిణ మధ్య రైల్వే దేశాభివృద్ధి, ఐక్యత కోసం తనవంతు పాత్ర సమర్ధవంతంగా పోషిస్తుందని చెప్పుకోవడానికి ఆనందిస్తున్నామని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 2015-16 చివరి త్రైమాసికలో ఎస్‌సి రైల్వే జోన్ 2015 స్థూల ఆదాయం రూ. 9987 కోట్లుగా నమోదయ్యిందని తెలిపారు. గత సంవత్సరం ఇదే కాలంలో సాధించిన ఆదాయం రూ. 9337 కోట్లుతో పోల్చితే ఇది ఏడు శాతం ఎక్కువని అన్నారు. ఇదే సమయంలో ఎస్‌సి రైల్వే 81.8 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసిందన్నారు. ఈ సంవత్సరం ప్రాంతీయ బొగ్గు రవాణా సగటున ప్రతి రోజు 33.6 రేకులుగా నమోదై గత ఏడాదితో పోల్చితే 34.4 శాతం అధికంగా నమోదయ్యింది. ప్రయాణికుల రవాణా రంగంలో గత సంవత్సరం 2015 డిసెంబర్ నాటికి 277.12 మిలియన్ల ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేయగా ఆర్థిక ప్రామాణికతను సూచించే ఆపరేటింగ్ నిష్పత్తి ఈ ఆర్థిక సంవత్సరం వరకు 79.3 శాతానికి చేరుకుందన్నారు. ఈ పని తీరు సరుకు రవాణా రంగంలో నెలకొన్న మాధ్యమన్నారు. ఎస్‌సి రైల్వే పరిధిలో ఏర్పడిన వరదలు, భారీ వర్షాలు కారణంగా రైల్వే వ్యవస్థకు వాటిల్లిన నష్టాలతో పోల్చితే ఖచ్చితంగా ప్రోత్సాహకరమైన స్థాయికి చేరుకున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 118.20 కిలోమీటర్ల మెర కొత్త రైల్వే లైన్లు నిర్మాణం జరిగిందని తెలియజేయడానికి ఎంతగానో ఆనందిస్తున్నామన్నారు. ప్రయాణికుల భద్రతలో భాగంగా తక్షణం సేవలందించే విధంగా భద్రత చెందిన హెల్ప్‌లైన్ నెంబర్ 182 ద్వారా ఈ సంవత్సరం మొత్తం 1027 ఫిర్యాదులు నమోదయ్యాయన్నారు. రైళ్లలో ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులు, ఆభరణాలను దొంగలించినట్లు నమోదైన ఫిర్యాదుల్లో 197 మందిని నిర్బంధంలోకి తీసుకుని వారి నుంచి రూ. 32.20 లక్షలు విలువైన సొత్తును స్వాధీనం చేసుకోవడంతోపాటు వాటిని వారి యజమానులకు అప్పగించడం జరిగిందన్నారు. అలాగే ఇంటి నుండి పారిపోయి వచ్చిన 442 మంది బాలలను వారి తల్లిదండ్రులకు అప్పగించిన రైల్వే భద్రత సిబ్బంది విధి నిర్వహణ ప్రశంసనీయమైందని అన్నారు. చివరగా అంగవైకల్యమైన విద్యార్థులు ప్రదర్శించిన ఏకపాత్రాభినయం, జానపద గీత నృత్యం అధికారులను, పలువురిని ఎంతగానో ఆకర్షించాయి. అనంతరం జాక్ అండ్ జిల్, రైల్వే మిక్స్‌డ్ హైస్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల నృత్యాలను పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. చివరగా గణతంత్ర దినోత్సవం నిర్వహణతో పాటు అన్ని రకాల విభాగాల్లో ప్రశంసలు పొందిన 150 మందికి ప్రశంసలు పొందిన బాలలకు నగదు పురస్కారాల కింద మొత్తం రూ. 70 వేలతోపాటు ప్రశంసపత్రాలను డిఆర్‌ఎం అశోక్‌కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డిపిఓ ఎం శ్రీరాములు, సీనియర్ డిసిఎం ఎమ్‌వి సత్యనారాయణ, సీనియర్ డిఎంఇ ప్రదీప్‌కుమార్‌లతోపాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సీనియర్ సెక్యూరిటీ కమిషనర్ ఎస్‌ఆర్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.