కృష్ణ

చంద్రన్న సంచార చికిత్సకు విశేష ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 21: చంద్రన్న సంచార చికిత్స పథకానికి విస్తృత ఆదరణ లభిస్తోంది. పేదల ఆరోగ్య పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా, సంపూర్ణ ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంలో భాగంగా ప్రారంభించిన ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల జనం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు. తమ ఊళ్లలో, తమ వాడల్లోకే వచ్చి వైద్యం అందిస్తున్న ఈ పథకం తమకెంతో ఉపయుక్తంగా ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి దూరంగా ఉండే హాస్పిటల్స్‌కు వెళ్లి వైద్యం చేయించుకోలేని వారికి ఈ పథకం వరంగా మారింది. అందుకే ఈ సంచార వైద్యశాలల్లో వైద్యం చేయించుకుంటున్న జనం సంఖ్య రోజురోజుకూ అమాంతం పెరిగిపోతోంది. ఈ పథకం ప్రారంభించిన ఐదు నెలల కాలంలోనే 10 లక్షల మందికి పైగా రోగులు సంచార వైద్యశాలల్లో చికిత్స చేయించుకున్నారంటే దీనికి లభిస్తున్న ఆదరణను అర్ధం చేసుకోవచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు కిలోమీటర్ల దూరం ఉండే ఊళ్లన్నిటికీ రోజుకు ఒకటి నుంచి రెండు గ్రామాల చొప్పున చంద్రన్న సంచార చికిత్స రథాలు వెళ్లి వైద్యం అందించాలి, నెల తిరిగేసరికి తమకు కేటాయించిన గ్రామాలన్నిటికీ వైద్య సేవలందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13,903 గ్రామాలకు వైద్య సేవలు అందించాల్సి ఉంది. ఒక్కో జిల్లాకు 17 నుంచి 26 చొప్పున మొత్తం 277 మొబైల్ మెడికల్ యూనిట్లను ఈ పథకానికి కేటాయించారు. ఒక్కో యూనిట్‌లో ఒక మెడికల్ ఆఫీసర్, స్ట్ఫా నర్స్, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు. మొత్తం మీద 250 మంది డాక్టర్లు, దాదాపు 900 మంది వైద్య సిబ్బంది చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమం కింద పని చేస్తున్నారు.
చంద్రన్న సంచార చికిత్స పథకం కింద ప్రతిరోజూ 10 వేల మందికి పైగా వైద్య సేవలు పొందుతున్నారు. ఈ ఐదు నెలల కాలంలో ఇప్పటివరకు 10 లక్షల 27 వేల మందికి పైగా వైద్య సేవలు పొందారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రతిరోజూ సగటున నాలుగొందలకు పైగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన 36,272 వైద్య శిబిరాల్లో దాదాపు లక్షా 20 వేల మంది రోగులకు వైద్య పరీక్షలు చేశారు. దాదాపు రెండు లక్షల మంది రోగులకు మందులు అందజేశారు. గర్భిణుల నుంచి చిన్నారుల వరకు సీజనల్‌గా వచ్చే మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధుల నుంచి దీర్ఘకాలిక జబ్బులైన ఎయిడ్స్, కుష్ఠు, టిబి వంటి 12 రకాల జబ్బులకు వైద్యం అందిస్తున్నారు. చిన్నారులకు చుక్కల మందు నుంచి రోటావైరస్ వ్యాక్సినేషన్ వరకు చేస్తున్నారు. ఈసిజి, మధుమేహం, రక్తపోటు వంటి సుమారు 27 రకాల పరీక్షలు నిర్వహించి, రోగులకు నివేదిక ఇవ్వడంతో పాటు మందులు కూడా ఇస్తున్నారు. అలాగే రోగుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపర్చి డేటా నిర్వహిస్తున్నారు. అలాగే వైద్య సేవలందించడానికి వెళ్లే గ్రామాల్లో జనం తాగునీటి నమూనాలు సేకరించి, పరీక్షలు నిర్వహించి అవి సురక్షితమా కాదా అన్న అంశాన్ని కూడా నిర్ధారించి పంచాయతీకి తెలియజేస్తారు. అవసరమైతే తాగునీటిని క్లోరినేషన్ కూడా చేస్తారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో 30 శాతం మంది మాత్రమే ఆధునిక వైద్యం అందుబాటులో ఉందని మిగిలిన వాళ్లంతా నామమాత్రపు వైద్య సేవలతో సరిపెట్టుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. దీంతో మారుమూల గ్రామీణ ప్రజలు కూడా ఆధునిక వైద్య సేవలు పొందడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ను సాధించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు చంద్రన్న సంచార చికిత్స పథకం ఏ మేరకు పని చేస్తుందన్న అంశంపై ఆయన ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.

ఆక్వా రైతులు ఆటో కార్డ్ అందజేయాలి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, సెప్టెంబర్ 21: ఆటో కార్డ్‌లు అందజేయని చేపలు, రొయ్యలు సాగు చేసే రైతులందరూ వాటిని అందజేయాలని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు రైతులకు విజ్ఞప్తి చేశారు. వారి చెరువులు రిజిస్ట్రేషన్‌తో పాటు వాటిని రెగ్యులర్ చేసుకోవాలని రైతులకు చెప్పారు. ఆయన బుధవారం బందరురోడ్డులోని క్యాంప్ కార్యాలయంలో ఫిషరీస్ శాఖపై రెవ్యూ చేశారు. అందులో భాగంగా గత రెండు రోజులుగా కృష్ణాజిల్లాలో వివిధ మండలాల్లో ఇప్పటివరకు 1,933 చేపల, రొయ్యల చెరువులకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ పూర్తి చేయటం జరిగిందన్నారు. ఇంకా పెండింగ్‌లో 3,775 చెరువులకు చెందిన రిజిస్ట్రేషన్స్‌ను పూర్తి చేయాల్సి ఉందని సంబంధించిన మత్స్యశాఖ అధికారులు జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడుకి తెలిపారు. ఈ చెరువులకి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా త్వరగ పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ వారిని ఆదేశించారు. జిల్లాలో ఆక్వాసగు చేసే రైతులు పాత, కొత్త చెరువులకు సంబంధించి పెండింగ్ ఆటో కార్డ్‌లను అధికారులకు అందజేయాలని దీని కోసం మండలానికి ఒకరు చొప్పున ప్రత్యేక టీంలను కూడా వేసినట్టు జాయింట్ కలెక్టర్ చెప్పారు. ఈ సమీక్షలో మత్స్యశాఖ డిడి కోటేశ్వరరావుతో పాటు ఫిషరీస్ అధికారులు జయరాం, రాఘవరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

సర్వే వేగవంతానికి
అదనపు ఎన్యూమరేటర్లు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, సెప్టెంబర్ 21: ప్రజాసాధికారిత సర్వేను విజయవాడ నగరంలో వేగవంతం చేసేందుకు సుమారు 130వ మంది ఎన్యూమరేటర్లను నియమించడం జరిగిందని జిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. భూపరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా హైదరాబాద్ నుంచి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ రోజుకు లక్ష మంది వివరాలు ప్రజాసాధికారిత సర్వేలో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకుంటునట్లు వివరించారు. 15 రోజుల్లోపు సర్వేను జిల్లాలో పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. అన్ని ప్రభుత్వశాఖల అధికారులను ఎన్యూమరేటర్లపై పర్యవేక్షకులుగా నియమించడం జరిగిందన్నారు. స్వయంగా తాను విజయవాడ నగరంలోని 10 మంది ఎన్యూమరేటర్లకు పర్యవేక్షక అధికారిగా వ్యవహరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ మాట్లాడుతూ నగరంలో ప్రజాసాధికారిత సర్వే వేగవంతం చేయడానికి అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రస్తుతం 750 మమంది ఉన్న ఎన్యూమరేటర్ల సంఖ్యను పెంచనున్నామన్నారు. ప్రతి సీనియర్ అధికారిని 5 నుంచి 7 వార్డులకు పర్యవేక్షకులుగా నియమించామన్నారు. విజయవాడ నగరం సమీపంలోని గ్రామాల నుండి ఎన్యూమరేటర్లను విజయవాడకు రప్పించనున్నామని ఆయన పేర్కొన్నారు. 15 రోజుల్లోపు ప్రజాసాధికారిత సర్వే పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ అరుణ్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మంగళ్‌దీప్ అగర్‌బత్తి నుండి
డివోషనల్ యాప్ విడుదల
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, సెప్టెంబర్ 1: ఐసిటి లిమిటెడ్ వారి మంగళ్‌దీప్ అగర్‌బత్తి విభాగం నుండి పూజలు, మంత్రాలు, భజనలు, భక్తిపాటలతో కూడిన ఆధ్యాత్మిక మొబైల్ యాప్‌ను విడుదల చేస్తున్నట్లు ఐటిసి అగర్‌బత్తిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విఎం రాజశేఖర్ నేడొక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రకటనలో ఈ యాప్‌లో దైవ సంబంధిత సమాచారంతోపాటు పూజలు ఏ విధంగా చెయాలో, పంచాంగం, క్యాలెండర్, పుణ్యక్షేత్రాల సమాచారం వంటి వివరాలను ఈ యాప్‌లో పొందుపరచినట్లు తెలిపారు.

క్షేత్రస్థాయిలో అభివృద్ధి జరగాలి
నాగాయలంక, సెప్టెంబర్ 21: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు జరిగినప్పుడే వాటి ప్రయోజనం ప్రజలకు దక్కుతుందని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అధికారుల పనీతీరుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వినూత్న పథకాలను ప్రవేశ పెడుతోందన్నారు. ఈ పథకాలన్నీ అమలుపర్చే విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు. మండలంలో పలు సమస్యలు ఉన్నప్పటికీ ప్రాధాన్యతా క్రమంలో కొన్ని సమస్యలను అయినా పరిష్కరించేందుకు నూతన పథకాలు దోహదపడతాయన్నారు. ముఖ్యంగా ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డు, మరుగుదొడ్లు, తాగునీరు వంటి ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ప్రభుత్వ యం్ర తాంగం ఈ పథకాల అమలు విషయంలో నిద్రాణంగా ఉండటాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. కాలువ చివరి భూములకు నీరు అందించే విషయంలో రెవెన్యూ, పోలీసు, నీటి పారుదల శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. మండల పరిషత్ అధ్యక్షులు సజ్జా గోపాలకృష్ణ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఎంపిడిఓ వి ఆనందరావు, తహశీల్దార్ స్వర్గం నరసింహారావు, ఎంఇఓ పద్యాల నాగేశ్వరరావు, ఎఎంసి ఛైర్మన్ మండవ బాలవర్ధనరావు, డిసి ఛైర్మన్ అంబటి లక్ష్మణప్రసాద్, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

ప్యాకేజీలు తీసుకోవడానికి రైతులేమీ బిచ్చగాళ్లు కాదు
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, సెప్టెంబర్ 21: మీరిచ్చే ప్యాకేజీలు తీసుకోడానికి రైతులేమీ బిచ్చగాళ్ళు కాదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పాలకులపై విరుచుకుపడ్డారు. బందరు ఓడరేవు, పారిశ్రామికవాడ పేరుతో రైతుల గొంతు కోయాలనే ఆలోచన విరమించుకోవాలని, లేకుంటే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. బందరు పోర్టు కావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారని, అయితే పోర్టు పేరుతో అవసరానికి మించిన భూములను పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే ప్రభుత్వ దుశ్చర్యలను తిప్పికొడతామన్నారు. బుధవారం మచిలీపట్నం వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పోర్టు, పారిశ్రామికవాడ పేరుతో 33వేల ఎకరాల భూములను రైతుల నుండి బలవంతంగా సమీకరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రతిఒక్కరూ తిప్పికొట్టాలన్నారు. మాటల గారెడీతో రైతులను మోసగించే ప్రయత్నాలను విరమించుకోవాలన్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎకరం భూమి ఇచ్చి 25 సెంట్లు తీసుకోడానికి రైతులు బిచ్చగాళ్లు కాదన్నారు. ప్రపంచంలో ఎక్కడా 5వేల ఎకరాల్లో పోర్టులు లేవన్నారు. మేజర్ పోర్టులన్నీ 2వేల ఎకరాల్లోపే నిర్మించారన్నారు. బందరులో సముద్రపు లోతు 13మీటర్లు మాత్రమే ఉందని, ఈ ప్రాంతానికి భారీ ఓడలు వచ్చే అవకాశం లేదన్నారు. ఈనేపథ్యంలో అన్ని వేల ఎకరాల భూమి పోర్టుకు అవసరం లేదన్నారు. అందుబాటులో ఉన్న 2వేల ఎకరాల ప్రభుత్వ భూముల్లోనే పోర్టు నిర్మించాలన్నారు. అలాగే పారిశ్రామికవాడ పేరుతో పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని నిప్పులు చెరిగారు. ల్యాండ్ పూలింగ్‌లో ఎకరం భూమిలో 25 సెంట్లు రైతులకు ఇచ్చి మిగిలిన 75 సెంట్ల భూమితో బ్యాంక్‌లలో పెద్దఎత్తున రుణాలు పొంది వ్యాపారాలు చేసేందుకే పారిశ్రామికవేత్తలకు భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుమ్మెత్తిపోశారు. మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ పేరుతో బందరును అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ గుజరాత్‌లో 7500 ఎకరాల్లో రిలయన్స్ సంస్థ నిర్మించిందన్నారు. అలాగే ముంబైలో హెచ్‌పిసిఎల్ ఆయిల్ రిఫైనరీ 239 ఎకరాల్లో ఉందన్నారు. మరి బందరులో రిఫైనరీలు, పెట్రోలియం ప్రాజెక్ట్‌లకు 28వేల ఎకరాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. పోర్టు, పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములను ల్యాండ్ పూలింగ్ విధానంలో కాకుండా 2013 భూసేకరణ చట్టం ప్రకారం తీసుకోవాలన్నారు. చట్టం ప్రకారం బాధిత రైతులకు పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి శోభనాద్రీశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి ఉద్యమించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

తిరువూరులో ఐటీ శాఖ తనిఖీలు
తిరువూరు, సెప్టెంబర్ 21: తిరువూరు పట్టణంలోని పలు వ్యాపార దుకాణాల్లో బుధవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వ్యాపార లావాదేవీలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, ఇతర వివరాలపై యజమానులను ప్రశ్నించారు. దుకాణంలోని వస్త్రాలు, రికార్డులు, కంప్యూటర్లను సోదా చేశారు. మసీదు సెంటర్‌లోని శ్రీ విఘ్నేశ్వర ప్లైవుడ్ అండ్ ఐరన్ హార్డ్‌వేర్ దుకాణంలో, చీరాల సెంటర్‌లోని బొంబాయి డైయింగ్ వస్త్ర దుకాణంలో ఈ సోదాలు నిర్వహించారు. సాయంత్రం ప్రారంభమైన దాడులు రాత్రి 10గంటల వరకు కూడా కొనసాగుతున్నాయి.

పురిటిగడ్డను ఆదర్శనీయంగా తీర్చిదిద్దుతా
చల్లపల్లి, సెప్టెంబర్ 21: పురిటిగడ్డను మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి చేస్తానని అదనపు డిజిపి ఆర్‌పి ఠాగూర్ అన్నారు. బుధవారం దత్తత గ్రామమైన పురిటిగడ్డను ఆయన సందర్శించారు. పాత పంచాయతీ భవనంలో ఏర్పాటు చేసిన లైబ్రరీని ప్రారంభించిన అదనపు డిజిపి నూతనంగా ప్రారంభించిన పిహెచ్‌సి భవనాన్ని పరిశీలించి వైద్యాధికారి రత్నగిరిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆసుపత్రికి కావాల్సిన ఎక్యుప్‌మెంట్, కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని వైద్యాధికారి వివరించగా అక్కడికక్కడే ఫోన్‌లో మంత్రి కామినేని శ్రీనివాస్‌తో మాట్లాడారు. అనంతరం జెడ్పీ పాఠశాలలో జరుగుతున్న డిజిటల్ విద్యాబోధనను పరిశీలించారు. ఈసందర్భంగా ఠాగూర్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి నిధుల సమీకరణకు సంబంధిత మంత్రులతో పాటు ముఖ్యమంత్రితో కూడా మాట్లాడతానన్నారు. వ్యసనాల బారిన పడకుండా విద్యార్థులు ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన తాను ఇష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చానని, అదేవిధంగా ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. ప్రవాస భారతీయులు వెలగపూడి మోహనకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ వాతావరణం అంటే తనకెంతో ఇష్టమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించి వారికి సహకారం అందించేందుకు త్వరలో ట్రస్టు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అదనపు డిజిపి ఆర్‌పి ఠాగూర్‌తో కలిసి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్, అవనిగడ్డ డిఎస్పీ ఖాదర్ బాషా, ఎంపిపి యార్లగడ్డ సోమశేఖరప్రసాద్, జెడ్పీటిసి కృష్ణకుమారి, సర్పంచ్ సురేష్, ఎంపిటిసి సభ్యులు డి గోపాలకృష్ణ, తహశీల్దార్ భిక్షారావు, తదితరులు పాల్గొన్నారు.

భాషా సంస్కృతి పరిరక్షణకు గురజాడే అడుగు
ఉయ్యూరు, సెప్టెంబర్ 21: తెలుగుభాష, సంస్కృతి ఉన్నతికి పాటుపడిన మహనీయుడు మహాకవి గురజాడ అప్పారావు అని ప్రముఖ సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ అన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న సేవాసమతి ఆధ్వర్యంలో బుధవారం గురజాడ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కన్యాశుల్కం వంటి సామాజిక రుగ్మతలపై పోరాడిన పోరాటయోధుడు గురజాడ అని నివాళి అర్పించారు. తెలుగుజాతి ఉన్నంతవరకు గురజాడ సేవలు గుర్తుంచుకోవాలని సమితి అధ్యక్షులు కాగిత కొండ అన్నారు. ఈ కార్యక్రమంలో సమితి నాయకులు అజ్మతుల్లా, రాజులపాటి ఫణి, తదితరులు పాల్గొన్నారు.

అట్టహాసంగా మార్కెట్ యార్డు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
జగ్గయ్యపేట, సెప్టెంబర్ 21: జగ్గయ్యపేట వ్యవసాయ కమిటీ చైర్మన్‌గా మల్లెల గాంధీతో సహా సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో మాజీ మంత్రి నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తదితర ప్రముఖుల సమక్షంలో చైర్మన్‌గా మల్లెల గాంధీ, వైస్ చైర్మన్‌గా సయ్యద్ గఫూర్, సభ్యులుగా నూకల బాలకృష్ణ, మహాంకాళి అనిల్, నాగేశ్వరరావు, పొట్టబత్తిన గంగాధరరావు, రాజ్యలక్ష్మి, శీలం నాగయ్య, బండి సత్యనారాయణ, గుండ్ల కృష్ణారావు, గొల్లా సైదులు, ఇనపనుర్తి రాజు, ధారవత్ వస్రాం, మీసాల శ్రీనివాసరావులచే యార్డ్ కార్యదర్శి వెంకట నర్శింహరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నేతలను ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులను అభిమానులు ఘనంగా సత్కరించారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని, మార్కెట్ యార్డ్‌ల ద్వారా రైతులకు సంపూర్ణ సహకారం అందించేందుకు కృషి చేస్తామని మాజీ మంత్రి నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మల్లెల గాంధీతో సహా వక్తలు పేర్కొన్నారు. యార్డ్‌లో సుమారు 6కోట్లతో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం, యార్డ్ ఆదాయం పెంపు, రైతు సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలు సవివరంగా వివరించారు.
తొలుత కార్యాలయంలో పూజల అనంతరం సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుమహిళ అధ్యక్షురాలు ఆచంట సునీత, మాజీ యార్డ్ చైర్మన్ గింజుపల్లి రమేష్, ప్లోర్ లీడర్ యలమంచిలి రాఘవ, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం బదిరీనారాయణ, శ్రీరాం సుబ్బారావు, తొండపు జగన్మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.

వాతావరణ మార్పులతో
ఆక్వా రంగం అతలాకుతలం
* పడిపోయిన ఆక్సిజన్ (డిఓ)
* ఖాళీ అవుతున్న రొయ్యల చెరువులు
* ఆందోళనలో ఆక్వా రైతులు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 21: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలు ఆక్వా రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకోవటంతో ఆక్సిజన్ అందక రొయ్యలు, చేపలు మృత్యువాత పడుతున్నాయి. కలిదిండి, బంటుమిల్లి, బందరు, కోడూరు, నాగాయలంక, తదితర ప్రాంతాల్లో సాగు చేస్తున్న వనామి రొయ్యల చెరువులను యుద్ధప్రాతిపదికన ఖాళీ చేసి అయినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు. వాతావరణంలో చల్లదనం పెరగటం, కారుమబ్బులు కమ్ముకుని వర్షం కురుస్తూ ఆక్సిజన్ (డిఓ) ఒక్కసారిగా పడిపోవటంతో ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుండి బుధవారం మధ్యాహ్నం వరకు ఆగకుండా ఏరియేటర్లను తిప్పినా ఆక్సిజన్ సమస్య పరిష్కారం కావటం లేదని, అందుకే చెరువులను ఖాళీ చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. అయితే నెలరోజుల్లో రొయ్యలు 50 కౌంట్‌కు వస్తాయని, ప్రస్తుతం 100 నుండి 80 కౌంట్ వరకు మాత్రమే ఉన్నాయని, ఈసమయంలో పట్టుబడి చేస్తే భారీ నష్టం వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినాసరే కొందరు రైతులు పూర్తిగా నష్టపోయేకంటే ఎంతోకొంత ఖర్చులతో బయటపడవచ్చనే ఉద్దేశంతో రొయ్యలను పట్టుబడి చేస్తున్నామని చెబుతున్నారు.