కృష్ణ

శ్రీ గాయత్రీదేవి అలంకారంతో దుర్గమ్మ దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 3:: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ దసరా మహోత్సవాల సందర్భంగా ఆశ్వయుజ శుద్ధ విదియ (వృద్ధి) మూడవ రోజైన సోమవారం శ్రీ గాయత్రీదేవి అలంకారంతో దివ్య దర్శనం ఇచ్చింది. నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిస్తున్న సంధ్యావందన అధిష్ఠాన దేవతను దర్శించుకొంటే మంచి ఫలితాలు పొందవచ్చనే నమ్మకంతో భక్తులు ఈగాయత్రీమాతను దర్శించుకోవటానికి సోమవారం అధిక సంఖ్యలోఇంద్రకీలాద్రికి తరలి వచ్చారు. సకల మంత్రాలకీ, మూలమైన శక్తిగా ఈవేదమాతగా ఈగాయత్రీదేవి ప్రసిద్ధి పొందిన కారణంగానే భక్తుల రద్ధీకి ముఖ్యకారణంగా మారింది. ఈతల్లి శిరస్సులో బ్రహ్మ, హృదయం నందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసించటంతో ఈమాతను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకొని ఆమె ఆశీస్సులను పొందటానికి వచ్చారు. ఈమాత వరదాభయహస్తాలను ధరించి భక్తులకు దివ్య అశీస్సులను అందించిది. ఎంతోవిశిష్టమైన తల్లిని దర్శించుకోవటానికి భక్తులు ఉదయం, సాయంత్రం, రెండుపూటల అమ్మవారి సన్నిధిలోభక్తుల రద్ధీ కనబడింది. కెనాల్ రోడ్ వినాయకుడి వద్ద ప్రారంభమైన క్యూమార్గంలోకి భక్తులు ప్రవేశించి రథం సెంటర్, అశోక్ స్తంభం, అమ్మవారి టోల్‌గేట్ మీదుగా ఘాట్ రోడ్‌లో ఏర్పాటు చేసిన క్యూమార్గం గుండా అమ్మవారి సన్నిధికి చేరుకుని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. బయటకు వచ్చే క్యూమార్గం గుండా శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయానికి వచ్చి అక్కడ పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. తర్వాత మల్లిఖార్జునస్వామి మెట్ల మార్గం గుండా మల్లిఖార్జునపేటలో ఉన్న శ్రీ మల్లిఖార్జున మహా మండపం ఆవరణలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అర్జున వీధి మీదుగా శంకరమఠంలో శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదాన పథకంలో మూడవ రోజైన సోమవారం 40 వేల మంది భక్తులు భోజనాలు చేశారు. మఠానికి ఎదురుగా శ్రీ కనకదుర్గనగర్‌లో ఏర్పాటు చేసిన ప్రసాదాల కౌంటర్‌లో భక్తులు అమ్మవారి మహా ప్రసాదాలైన లడ్డు, పులిహార కొనుగోలు చేశారు. క్యూ మార్గంలో భక్తులను పోలీసులు ఎక్కడికక్కడే నియంత్రిస్తూ బృందాలు బృందాలుగా దర్శనం చేసుకోవటానికి అనుమతించారు.

ధైర్యంగా అమ్మవారి ప్రసాదాలను
కొనుగోలు చేయవచ్చు
* దుర్గగుడి ఇవో ఎ సూర్యకుమారి
ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 3: అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ధైర్యంగా అమ్మవారి మహాప్రసాదాలైన లడ్డూ, పులిహార కొనుగోలు చేయవచ్చని దుర్గగుడి ఇవో సూర్యకుమారి భక్తులకు భరోసా ఇచ్చారు. సోమవారం ఉదయం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఆదివారం జరిగిన సంఘటన కేవలం ప్రకృతి సిద్ధంగా జరిగింది తప్ప సిబ్బంది తప్పుఏమాత్రం లేదన్నారు. ఆదివారం వేకువ జామున వర్షం పడటంతో ఈచల్లదనాన్ని పురుగులు వచ్చి వాలటం జరిగిందని వివరణ ఇచ్చారు. అమ్మవారి ప్రసాదాలను నిరంతరం పరిశుభ్రమైన వాతావరణం లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రా వీణ్యం ఉన్న సిబ్బంది చేత తయారు చేయించి విక్రయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. భక్తులు సూచనలు, వివిధ శాఖల అధికారుల సలహాలు పాటిస్తూ నిరంతరం భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారిని దర్శించుకోనే విధంగా విస్తుృతస్థాయిలో ఏర్పాట్లు చేసిన కారణంగానే భక్తులు మూడవ రోజైన సోమవారం కూడా ప్రశాంతమైన వాతారణంలో అమ్మవారిని దర్శించుకోవటం జరిగిందన్నారు. ప్రకృతి సిద్ధంగానే ఆదివారం చిన్న పొరపాటు జరిగిందన్నారు. భవిష్యత్‌లో మరోసారి ఇటువంటి తప్పిదం జరగకుండా చర్యలు చేపట్టినట్లు ఆమె చెప్పారు. ఈసమావేశంలో దుర్గగుడి సహాయ ఇవో శ్రవణం అచ్యుతరామయ్యనాయుడు పాల్గొన్నారు.