కృష్ణ

ఇక నగరం నుంచే పోలీసు పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 30: నగరంలో సోమవారం డిజిపి క్యాంప్ కార్యాలయం ప్రారంభమైంది. పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి హడావుడి లేకుండా పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో నిరాడంబరంగా డిజిపి జెవి రాముడు క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా అక్కడ చెట్టు కింద అందరికీ దర్శనమిచ్చే నాలుగు అడుగుల బుద్ధ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విగ్రహానికి డిజిపి పూలమాలలు వేశారు. ప్రారంభం సందర్భంగా కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. అమరావతి అంతర్జాతీయ ప్రమాణాలు అద్దుకుంటున్న క్రమంలో డిజిటల్ వరల్డ్ ప్రాధాన్యతను చాటుతూ సైబర్ నేరాలను నివారించేందుకు దోహదం చేసేందుకు ముందుకొచ్చిన ఇఎస్‌ఎఫ్ ల్యాబ్స్‌ను అభినందించారు. ఇఎస్‌ఎఫ్ ల్యాబ్స్ మొదటి దశగా ముద్రించిన సైబర్ క్రైం ఇనె్వస్టిగేషన్- టెక్నిక్స్-1 అనే పుస్తకాన్ని డిజిపి ఆవిష్కరించారు. పోలీసు శాఖలో సాంకేతిక పరిఙ్ఞనాన్ని ప్రవేశపెడుతూ సైబర్ క్రైం పట్ల అవగాహన కలిగించేందుకు 500 మందికి శిక్షణ ఇస్తామన్నారు. భవిష్యత్తులో సైబర్ నేరాలు పెరిగే అవకాశం ఉన్నందున సైబర్ సెక్యూరిటీపై ఆధారపడాల్సి వస్తుందన్నారు. గూగుల్‌లో కనిపించని డార్క్‌నెట్‌ను తీవ్రవాదులు వినియోగిస్తూ తమ కార్యకలాపాలు కొనసాగిస్తారని, అలాంటి సమాచారాన్ని కూడా సైబర్ టెక్నాలజీ ద్వారా ఛేదించే అవకాశం ఉంటుందన్నారు. ఈదిశగా పరిశోధన చేస్తున్న ఇఎస్‌ఎఫ్ ల్యాబ్స్‌తో కలిసి పోలీసు శాఖ పనిచేస్తుందన్నారు. వాస్తవిక ప్రపంచంలో జరిగే క్రైంతో పోలిస్తే చీకటి ప్రపంచ అంతర్జాలంలో జరిగే క్రైం రేటు వంద రెట్లు ఎక్కువేనన్నారు. గత మూడేళ్లుగా నేషనల్ పోలీసు అకాడమీ, ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ కోస్టల్ సెక్యూరిటీపై పరిశోధన చేస్తున్నట్లు చెప్పారు. గుజరాత్ ఫోరెన్సిక్ సైనె్సస్ తరహా ఇక్కడ కూడా ప్రవేశపెడతామన్నారు. ఇఎస్‌ఎఫ్ ల్యాబ్స్ గుజరాత్ ఫోరెన్సిక్ సైనె్సస్‌తో పాటు బెంగళూరు, ముంబై, అండమాన్ నికోబర్‌లో కూడా సేవలు అందించడంతో పాటు శిక్షణ ఇస్తున్నట్లు ల్యాబ్స్ ఫౌండర్ అనిల్, డైరెక్టర్ రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డిజిపిలు ఆర్‌పి ఠాకూర్, ఎన్‌వి సురేంద్రబాబు, అనురాధ, విఎస్‌కె కౌముది, ద్వారకాతిరుమలరావు, నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్, డిసిపి జివిజి అశోక్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.