కృష్ణ

హామీల అమలుకు నిధుల సమస్య లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 7: ‘ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేయాలని తపిస్తున్నాను. ఇందుకు మీరు సహకరించాలి. జిల్లాల్లో పర్యటించే ముందే గతంలో ఇచ్చిన హామీలు అమలుకావాలి. మీకెంత సమయం కావాలో చెప్పండి. సమస్యలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన హామీల అమలుపై 12 విభాగాల అధికారులతో సమీక్షించారు. 926 హామీల్లో 283 హామీలు అమలుచేయగా 628 పరిష్కార దశలో ఉన్నాయని, మరో 15 హామీల అమలుకు చొరవ తీసుకోవాల్సి ఉందని చెప్పారు. నిధుల సమస్య లేదని తెలిపారు. నిధుల సమస్య ఎక్కడుందో అక్కడ కన్వర్జెన్స్‌తో పనులు చేపడుతున్నామని, నాబార్డు లాంటి సంస్థలతో ఇబ్బందులు వస్తే తనకు చెప్పాలని చంద్రబాబు కోరారు. ముఖ్యమంత్రి మంజూరు చేశారుకానీ నిధులు విడుదల కాలేదంటే అది విమర్శో, ప్రశంసో అర్థంకాని స్థితి అవుతుందన్నారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తిచేయాలని, సమస్యలు వస్తే సమన్వయంతో పనిచేయాలని కోరారు. పైస్థాయి అధికారులతో మాట్లాడి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు కిమిడి మృణాళిని, సిఎస్ టక్కర్, తదితరులు పాల్గొన్నారు.

జీఓ నెంబర్ 54ను ఉపసంహరించుకోవాలి

మైలవరం, నవంబర్ 7: కార్మికుల హక్కులను కాలరాసే జీఓ నెంబర్ 54ను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటియు, బిల్డింగ్ వర్కర్స్ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని వెల్వడంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నేతలు మాట్లాడుతూ కార్మికులు ఎంతో కష్టపడి, పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాన్ని తుంగలో తొక్కి కార్మిక సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను చంద్రన్న బీమాకు తరలించి కార్మికుల నోళ్ళలో మట్టికొడుతున్నారని ఆరోపించారు. కార్మికుల సంక్షేమానికి విఘాతం కలిగే జీఓ నెంబర్ 54ను వెంటనే రద్దు చేసి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈసందర్భంగా జీఓ నెంబర్ 54 ప్రతులను దగ్ధం చేశారు. ఎన్ని పోరాటాలు చేసైనా ఈజీఓను ఉపసంహరించుకునే వరకూ విశ్రమించబోమని, సంక్షేమ బోర్డును కొనసాగించుకుంటామని వారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఐటియు నేత సాల్మన్‌రాజు, బిల్డింగ్ వర్కర్స్ నేతలు వెంకటేశ్వరరావు, నాగేశు, కోటేశ్వరరావు, వరప్రసాద్, మోహన్, రామకృష్ణ, స్వామి, రాజారావు తదితరులు పాల్గొన్నారు.