కృష్ణ

ఉపాధ్యాయ సమస్యలపై సాచివేత ధోరణి తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), జనవరి 28: అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు అన్నారు. దీర్ఘకాలంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (్ఫ్యప్టో) జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట అన్ని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ధర్నా నిర్వహించారు. ధర్నాకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం సాచివేత ధోరణి అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాషా పండితులు, వ్యాయామోపాధ్యాయుల పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని, రూ.398ల వేతనంపై పనిచేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, మున్సిపల్ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించాలని, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని, ఎయిడెడ్ పాఠశాలల్లోని ఖాళీలను భర్తీచేయాలని, మున్సిపల్ టీచర్స్‌కు జిపిఎఫ్ సౌకర్యం కల్పించాలని, 2008 డిఎస్సీలో హామీ పత్రాలు పొందినవారికి నోషనల్ ఇంక్రిమెంట్లు, వేతన స్థిరీకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కెఎ ఉమామహేశ్వరరావు, ఎస్‌పి మనోహర్, సీతారామయ్య, ఎన్ రామబ్రహ్మం, కొమ్ము ప్రసాద్, శంకరనాథ్, వరుణకుమార్, రంగారావు, తదితరులు పాల్గొన్నారు.