కృష్ణ

రాయలసీమలో ఎకరా భూమీ ఎండనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 19: రాయలసీమలో ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా పంటలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు నగరంలో కడప జిల్లా పులివెందుల, జమ్మల మడుగు నియోజకవర్గాలకు చెందిన సుమారు వెయ్యి మంది బత్తాయి తోటల (చినీ) రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బత్తాయి తోటల రైతులు ఎదుర్కొంటున్న నీటి సమస్యను పరిష్కరించి పంటలను అన్ని విధాలా కాపాడుతామని రైతులకు హామీ ఇచ్చారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీరు తీసుకువచ్చి జల ఫిరంగులు (రెయిన్ గన్‌లు) ద్వారా పంటలకు నీటిని అందించి వాటిని కాపాడుతామన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 47 టిఎంసిల నీటిని తోడి పోలవరం కుడికాలువ ద్వారా కృష్ణానదిలోకి మళ్లించడం ద్వారా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం గావించామన్నారు. శ్రీశైలంలో ప్రస్తుతం పూర్తిస్థాయిలో 875 అడుగుల నీటిని నిల్వ చేసి ఆ నీటిని రాయలసీమ ఇతర జిల్లాల అవసరాలకు వినియోగించుకుంటున్నామని తెలిపారు. రాయలసీమలో 400 టిఎంసిల నీరు నిల్వ చేయగల సామర్థ్యం కలిగిన చెరువులు ఉన్నాయని వాటన్నిటినీ పూర్తిగా ఆధునికీకరించి భవిష్యత్‌లో రాయలసీమను కరవు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సిఎం చెప్పారు. అలాగే గాలేరు - నగరి - హంద్రీనీవా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, రాయలసీమ ప్రాంత ప్రజాప్రతినిధులు ఆదినారాయణరెడ్డి, సతీష్‌రెడ్డితోపాటు పలువురు చీనిగతోటల రైతులు, ఇతర రైతులు పాల్గొన్నారు.

ట్రాఫిక్ నియంత్రణకు ప్రణాళికలు
పాయకాపురం, నవంబర్ 19: నగరంలో ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌పోర్టేషన్, డెవలప్‌మెంట్ పాలసీ (ఐటిడిసి) ద్వారా ట్రాఫిక్ నియంత్రణకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ బాబు తెలిపారు. కలెక్టర్ ఛాంబర్‌లో ఎంపి కేశినేని, కలెక్టర్ బాబు, శాసన సభ్యులు గద్దెరామ్మోహన్, మండలి సభ్యులు బుద్దా వెంకన్న, ఎఎస్.రామకృష్ణ, మేయర్ కోనేరు శ్రీ్ధర్, నగర పాలక సంస్థ కమిషనర్ వీరపాండ్యన్, డిసిపిలు అశోక్‌కుమార్, రాణా, ఆర్టీసి అధికారులు, ఐటిడిపి సౌత్ ఆసియా డైరెక్టర్ శ్రేయ గాడేపల్లిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి కేశినేని మాట్లాడుతూ వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరం అంతే వేగంగా ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. ఐటిడిపి ప్రతినిధి శ్రేయ గాడేపల్లి విజయవాడకు చెందిన వారు అవ్వడం, అదే విధంగా తాను పని చేస్తున్న సంస్థ నాన్ ప్రాఫిట్‌బుల్ ఆర్గనైజేషన్‌గా సేవలు అందిస్తున్న నేపధ్యంలో ఆమెను ఆహ్వనించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఐటిడిఎ డైరెక్టర్ శ్రేయ తన పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివిధ దేశాలతో పాటు భారతదేశంలో వివిధ నగరాల్లో తమ సంస్థ ట్రాఫిక్ సిస్టం అవలంభిస్తున్న విధానాన్ని వివరించారు.

నేడు రెండో టి-20 మ్యాచ్
విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 19: ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులోని దేవినేని వెంకటరమణ,ప్రణీత క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న భారత్, వెస్టిండీస్ టి-20 సిరీస్‌లో ఆదివారం రెండవ టి-20మ్యాచ్ జరగనుంది. నగరానికి చెందిన మేఘన మొదటి టి-20 మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకోకపోవడంతో మేఘన స్నేహితులు, సదరు క్రికెటర్లు కొంత నిరాశకు గురయ్యారు. ఆదివారం జరిగే రెండవ టి-20కైనా తుది జట్టులో చోటు దక్కించుకుంటుందా లేదా అనే ప్రశ్నలకు ఆదివారం వరకు వేచిచూడాల్సిందే. మొదటి టి-20లో భారత ఓపెనర్లు అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో భారత జట్టులో ఓపెనర్‌గా చోటు దక్కించుకున్న మేఘన తుది జట్టులో మాత్రం చోటు సాధించలేకపోవడంతో రెండవ టి-20కి తుది జట్టులో చోటు ఉంటుందని సదరు క్రికెటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మేఘన చదివిన కొండపల్లి డిఎవి పబ్లిక్‌స్కూల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకొని శుక్రవారం మ్యాచ్‌కి ప్రారంభం నుండి డ్రమ్స్, బూరలతో హోరెత్తించారు. తుది జట్టులో మేఘన చోటు దక్కించుకోకపోవడంతో డిఎవి పబ్లిక్‌స్కూల్ విద్యార్థులు కొంత నిరాశ చెందారు. అయినప్పటికీ భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సిక్స్, ఫోర్ అంటూ సందడి చేశారు. ఆదివారం జరుగనున్న మ్యాచ్‌లో భారత జట్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయనడానికి భారత టి-20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్ మాటలు స్పష్టం చేస్తున్నాయి. మొదటి టి-20 ఓటమి అనంతరం మీడియా మాట్లాడిన హర్మన్ జట్టులో కొత్తగా చేరిన క్రికెటర్లు జట్టులో ఇమడడానికి సమయం పడుతుందని, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ అనుకున్న స్థాయిలో లేదని పేర్కొంది. దీంతో రెండవ టి-20 మ్యాచ్‌కు తుది జట్టులో మార్పులు తథ్యంగా కనబడుతుంది. మొదటి టి-20లో విశ్రాంతి తీసుకున్న వనే్డ కెప్టెన్ మిథాలీరాజ్ రెండవ టి-20కి జట్టులో చేరే అవకాశం ఉంది. వనే్డలో వెసిండీస్‌పై బ్యాట్‌తో విరుచుకుపడిన వేదాకృష్ణమూర్తి టి-20లో సైతం జోరును కొనసాగిస్తోంది. వేదాతో పాటు మరో ఇద్దరు హిట్టర్లు తుది జట్టులో చోటు సాధిస్తే భారత విజయాన్ని అడ్డుకోవడం కష్టం. మొదటి టి-20లో ఫీల్డింగ్, బౌలింగ్‌లో విఫలమైన భారత జట్టు రెండవ టి20లో ఆ తప్పును చేయకుండా ఉండటానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. డిపెండింగ్ చాంపియన్‌గా సిరీస్‌లో అడుగుపెట్టిన వెస్టిండీస్ మొదటి టి-20లో భారత్‌కు అవకాశం ఇవ్వకుండా చాంపియన్స్ అని నిరూపించింది. అదే జోరును కొనసాగించడానికి ప్రత్యేక ప్రణాళికలను తయారుచేస్తోంది. కెప్టెన్ స్ట్ఫోనీ టేలర్‌తో పాటు మాథ్యూస్, డాటిన్, అనిసామహ్మద్ వంటి అల్‌రౌండర్స్‌తో విండీస్ జట్టు చాలా పటిష్ఠంగా ఉంది.