కృష్ణ

నగరంలో తొలిసారిగా యుపిఎస్‌సి మెయిన్ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 23: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని విజయవాడలో మొదటి సారి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో మెయిన్స్ పరీక్షను డిసెంబర్ 3 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. అందులో భాగంగా డిసెంబర్ 3న శనివారం పేపర్-1 ఎస్సే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. 5న సోమవారం పేపర్ 2 జనరల్ స్టడీస్-1, ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-3 జనరల్ స్టడీస్-2ను మధ్యాస్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, 6వ తేదీ మంగళవారం పేపర్-4, జనరల్ స్టడీస్-3, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-5, జనరల్ స్టడీస్-4, మధ్యాస్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 7వ తేదీ బుధవారం పేపర్-ఎ ఇండియన్ లాంగ్వేజ్ ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, పేపర్ బి ఇంగ్లీష్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 9న శుక్రవారం పేపర్-6, ఆప్షనల్ పేపర్-1 ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, పేపర్-7, ఆప్షనల్ పేపర్-2 ఇంగ్లీష్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడతాయి.
విజయవాడలో నిర్వహించనున్న మెయిన్స్ పరీక్షకు ఆంధ్రా లయోలా కాలేజీలో నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో యుపిఎస్‌సి అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు వివరించడం జరిగింది. అందులో భాగంగానే నగరంలో మొదటిసారి మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నందుకు తగిన పోలీస్ బందోబస్తుతో తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు యుపిఎస్‌సి అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా యుపిఎస్‌సి అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ విజయవాడ పెద్ద సెంటర్ అని, మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌వో సిహెచ్ రంగయ్య, డిఎస్‌వో రవికిరణ్, ఎమ్మార్వో శివరావు, తదితర అధికారులు ఇందులో పాల్గొన్నారు.

ఎలక్ట్రానిక్ డిజిటల్ మిషన్ల ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో
చిన్నారుల ఎత్తు, బరువు నమోదు
* కలెక్టర్ బాబు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, నవంబర్ 23: చిన్నారులకు సరైన పౌష్టికాహారాన్ని అందించేందుకు వారి ఎత్తు, బరువు వివరాలను ఎలక్ట్రానిక్ డిజిటల్ మిషన్ల ద్వారా ఖచ్చితంగా ఆన్‌లైన్లో నమోదు చేయటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. నగరంలోని సింగ్‌నగర్ లూనా సెంటర్ నందు బుధవారం అంగన్‌వాడీ కేంద్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ సెక్రటరీ జయలక్ష్మీ, జిల్లా కలెక్టర్ బాబు.ఎ చిన్నారుల ఎత్తు, బరువులను నమోదు చేసే ఎలక్ట్రానిక్ డిజిటల్ మిషన్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా పైలెట్ ప్రాజెక్టుగా 100 అంగన్‌వాడీ కేంద్రాలలో ప్రారంభించి దశలువారీగా జిల్లాలోని 3,812 అంగన్‌వాడీ కేంద్రాలలో ఏర్పాటు చేయటం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అప్పుడే పుట్టిన చిన్నారుల నుండి ఐదేళ్ల పిల్లలకు వారి ఎత్తు, బరువులకు అనుగుణంగా పౌష్టికాహారాన్ని సమపాళ్లలో అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటివరకు చిన్నారుల ఎత్తు, బరువుల వివరాలు మాన్యువల్‌గా నమోదు చేస్తున్నారని ఎలక్ట్రానిక్ డిజిటల్ మిషన్లు ద్వారా ప్రతినెలా నమోదు చేయటం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. బయోమెట్రిక్ అథంటికేషన్‌తో ఆన్‌లైన్‌లో నమోదు కాబడి డాష్‌బోర్డుకు అనుసంధానించటం జరుగుతుందన్నారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన నమోదు విధానంలో సాంకేతిక సమస్యలను పరిష్కరించి తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. నేషనల్ హెల్త్ ట్రాకింగ్ సిస్టంకు డిజిటల్ మిషన్ అనుసంధానించటం జరుగుతుందని, తద్వారా చిన్నారులకు సమపాళ్లలో పౌష్టికాహారాన్ని అందించటం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నెలకొల్పవచ్చని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బాలాజీ, డెప్యూటీ మేయర్ గోగుల రమణరావు, జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్ శివపార్వతి, ప్రాజెక్టు డైరెక్టర్ కె.కృష్ణకుమారి, సిడిపిఓ మనోరంజని పాల్గొన్నారు.