కృష్ణ

సంక్షేమ ఫలాలు అందిపుచ్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), నవంబర్ 27: విశ్వబ్రాహ్మణులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందిపుచ్చుకుని లబ్ధి పొందాలని మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ అన్నారు. విశ్వబ్రాహ్మణ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక వలందపాలెం గంగులతోటలో కార్తీక వనసమారాధన నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులంతా సంఘటితమై సమాజ శ్రేయస్సుకు పాటుపడాలన్నారు. విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ కనకాబరి మాట్లాడుతూ ఫెడరేషన్ ద్వారా విశ్వబ్రాహ్మణులకు భారీగా రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఎవరికి ఏ సాయం కావల్సివచ్చినా నేరుగా తనను సంప్రదించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య, పి అశోక్‌బాబు, ఎల్ శ్రీనివాస ఛటర్జీ, డా. ఎం శ్రీనివాసరావు, బి పద్మా, కె శ్రీనివాస్ పాల్గొన్నారు.