కృష్ణ

అన్ని వాణిజ్యసంస్థల్లో తక్షణమే ఇపోస్ మిషన్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 30: జిల్లాలో 32వేల ఇపోస్ మిషన్లను వాణిజ్య సంస్థల్లో వినియోగించి నగదురహిత చెల్లింపులను ఉద్యమస్ఫూర్తితో చేపట్టాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ బాబు.ఎ వాణిజ్య పన్నులు, ఖజానా, బ్యాంకింగ్ అధికారులతో నగదురహిత చెల్లింపులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కమర్షియల్, రెవిన్యూ, లోకల్ ఫండ్ ఆడిట్, ట్రజరీ శాఖలకు చెందిన 120 టీములుగా వాణిజ్యసంస్థల్లో ఇపోస్ మిషన్లను ఏర్పాటు చేసేలా సంస్థ యజమానులతో అవగాహన కల్పిస్తారన్నారు. నగరం, పట్టణాలు, జిల్లాలో రిజిస్ట్రేషన్ అయిన సుమారు 32వేలు వాణిజ్యసంస్థలను గుర్తించామమని వీటిలో ఇపోస్ మిషన్లు ఏర్పాటు చేసేలా టీములు సిద్ధం చేయటం జరిగిందన్నారు. బ్యాంకు ఖాతాలు లేని దుకాణదారులకు తక్షణమే అకౌంట్‌ను ఓపెన్ చేయటంతో పాటు ఇపోస్ మిషన్లపై అవగాహన కల్పించి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సబ్‌కలెక్టర్ సలోని సిదాన, ఎల్‌డిఎం వెంకటేశ్వరరెడ్డి, బ్యాంకింగ్, వాణిజ్య, ట్రజరీ అధికారులు పాల్గొన్నారు.

జక్కంపూడిలో రైతుల రిజిస్ట్రేషన్ సమస్యలను
మూడో రోజుల్లోగా పరిష్కారం
* కలెక్టర్ బాబు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, నవంబర్ 30: జక్కంపూడిలో భూములు ఇచ్చిన రైతుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సమస్యలను మూడు రోజుల్లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ రిజిస్ట్రేషన్లు, రెవిన్యూశాఖ అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జక్కంపూడి రైతుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అంశంపై జిల్లా కలెక్టర్ రిజిస్ట్రేషన్లు, రెవిన్యూశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వానికి భూములిచ్చి సహాయం చేశారన్నారు. అటువంటి రైతులకు ప్రభుత్వపరంగా ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించవల్సిన అవసరం ఉందన్నారు. 60,40 నిష్పత్తిలో లేఅవుట్ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ అయ్యాయని, అయితే డాక్యుమెంట్లు, సర్వే నెంబర్లలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వానికి సంబంధించిన అంశంగా భావించి రిజిస్ట్రేషన్ శాఖ సవరణ దస్తావేజులకు ఎటువంటి రుసుం అవసం లేకుండా రైతులకు మేలు చేయాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో డిఆర్‌ఓ సిహెచ్ రంగయ్య, సబ్‌కలెక్టర్ సలోని సిదాన, జిల్లా రిజిస్ట్రార్ బాలకృష్ణ, రూరల్ తహశీల్దార్ మదన్‌మోహన్ పాల్గొన్నారు.

ఎస్‌పి 2...పోటీలకు సిద్ధమైన స్టేడియం
నేటి నుండి జాతీయస్థాయి
సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీ
* సిఎం చేతుల మీదగా ప్రారంభోత్సవం
* పోటీలకు స్టేడియాలు సిద్ధం
విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 30: కృష్ణాజిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 1నుండి 5వరకు డిపిఎస్ వరల్డ్ స్కూల్ 30వ జాతీయస్థాయి సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్) వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బంగార్రాజు తెలిపారు. స్థానిక డిఆర్‌ఆర్‌ఎంసి ఇండోర్ స్టేడియంలో బుధవారం సాయంత్రం విలేఖరుల సమావేశం జరిగింది. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుండి బాలుర విభాగంలో 280 మంది, బాలికల విభాగంలో 265 మంది క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. పోటీల నిర్వహణకు డిఆర్‌ఆర్‌ఎంసి ఇండోర్ స్టేడియంతో పాటు విజయవాడ క్లబ్, శ్రీదుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ఇండోర్ స్టేడియాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. సింగిల్స్, డబుల్స్ విభాగంలో పోటీలు జరుగుతాయన్నారు. ఈటోర్నీకి రెఫరీగా మహరాష్టక్రు చెందిన మంజూష సహస్రబుద్ధేను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బాయ్) నియమించినట్లు బాయ్ సంయుక్త కార్యదర్శి అంకమ్మచౌదరి తెలిపారు.1న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదగా పోటీల ప్రారంభోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. డిపిఎస్ వరల్డ్‌స్కూల్ ఈటోర్నీకి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తుందని తెలిపారు. ఈవిలేఖరుల సమావేశంలో డిపిఎస్ వరల్డ్ స్కూల్ వైస్ చైర్మన్ కుమారస్వామి, రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘ కార్యదర్శి రఘుకిరణ్, జిల్లా బ్యాడ్మింటన్ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ రామమోహన్, డా ఇ త్రిమూర్తి, నాగమణి, రేవతి, శ్రీనివాస్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్లు పూర్తి...
సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ జాతీయస్థాయి పోటీలకు డిఆర్‌ఆర్‌ఎంసి ఇండోర్ స్టేడియంతో పాటు విజయవాడ క్లబ్, శ్రీదుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఇండోర్ స్టేడియాలు సర్వంగా సుందరంగా తయారుచేశారు. డిఆర్‌ఆర్‌లో నాలుగు, విజయవాడ క్లబ్‌లో రెండు, ఎస్‌డిఎంఎస్‌లో నాలుగు కోర్టులు సిద్ధం చేశారు. క్రీడాకారులకు ప్రత్యేకంగా వసతి ఏర్పాటు చేసిన ప్రదేశం నుండి స్టేడియాలకు వాహనాలను ఏర్పాటుచేసి అందుబాటులో ఉంచారు. స్టేడియాలను శాప్ ఎండి బంగార్రాజు ప్రత్యేకంగా పరిశీలించారు.

ధాన్యం దళారులకు అమ్మొద్దు
* రైతులకు మంత్రి ఉమ సూచన
మైలవరం, నవంబర్ 30: రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవద్దని, వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే విక్రయించి లబ్ధిపొందాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు. బుధవారం ఆయన స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉంటాయన్నారు. ఏ గ్రేడు రకం క్వింటా 1,510 రూపాయలు, సాధారణ రకం క్వింటా 1,470 రూపాయల చొప్పున కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రైతు తమ నిల్వలను కొనుగోలు కేంద్రంలోనే అమ్ముకోవాలని సూచించారు. బయటి మార్కెట్‌లో దళారులకు అమ్ముకుని నష్టపోవద్దన్నారు. దళారులు తక్కువ ధరకు కొనటంతో పాటు తూకంలో మోసం చేస్తారన్నారు. ఈసందర్భంగా కొందరు రైతులు జి కొండూరు, మైలవరం మండలాల్లోనూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైనచోట్ల ఏర్పాటు చేసి సంచులు కూడా అందిస్తామని మంత్రి ఉమ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ ధనేకుల సాంబశివరావు, ఎంపిపి బాణావతు లక్ష్మి, తహశీల్దార్ కెవి శివయ్య, మార్కెట్ యార్డు సిబ్బంది, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

పోర్టు బాధిత రైతులతో
నేడు జగన్ ముఖాముఖి
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, నవంబర్ 30: శాసనసభ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి గురువారం జిల్లా కేంద్రం మచిలీపట్నం రానున్నారు. పోర్టు, పరిశ్రమల పేరుతో ప్రభుత్వం భూదోపిడీ చేస్తోందని నిరసిస్తూ ఆయన పర్యటించనున్నారు. బందరు మండలం బుద్ధాలపాలెం, కోన గ్రామాల్లో పోర్టు బాధిత రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఉదయం 10గంటలకు మూడు స్తంభాల సెంటరు నుండి బైపాస్ రోడ్డు మీదుగా బుద్ధాలపాలెం గ్రామానికి రోడ్ షోగా జగన్ వెళతారు. అక్కడి రైతులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం మళ్లీ రోడ్ షోగా కొత్తపూడి మీదుగా చిలకపూడి, రామానాయుడుపేట, జవ్వారుపేట చేరుకుని టక్యాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అక్కడి నుండి కాలేఖాన్‌పేట మీదుగా కోన గ్రామానికి చేరుకుని పోర్టు బాధిత రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. జగన్ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రభుత్వ మాజీ విప్ పేర్ని వెంకట్రామయ్య(నాని) బుధవారం ఆయా గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. జగన్ సభలకు భారీ సంఖ్యలో రైతులను సమీకరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
గ్రామీణ ప్రాంతాల
అభివృద్ధికి ప్రాధాన్యం
* మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం (కోనేరుసెంటర్), నవంబర్ 30: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జనచైతన్య యాత్రల్లో భాగంగా బుధవారం మండల పరిధిలోని తుమ్మలచెరువు గ్రామంలో ఆయన పర్యటించారు. చంద్రన్న బాటలో భాగంగా రూ.10లక్షలతో నిర్మించనున్న సిసిరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకే జనచైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనచైతన్య యాత్రల్లో వచ్చే సమస్యలను జనవరిలో నిర్వహించనున్న జన్మభూమి గ్రామసభల నాటికి పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, టిడిపి మండల అధ్యక్షులు తలారి సోమశేఖర్, గ్రామ సర్పంచ్ తలారి రామకుమారి, తదితరులు పాల్గొన్నారు.

ఎన్ని ఇబ్బందులున్నా హామీలన్నీ నెరవేరుస్తాం

మైలవరం, నవంబర్ 30: రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో ఉన్నప్పటికీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టీకరించారు. జనచైతన్య యాత్రలో భాగంగా బుధవారం ఆయన మండలంలోని కీర్తిరాయినిగూడెం, ఎదురుబీడెం, పోరాటనగర్, చంద్రాల గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన సందర్భంగా ప్రసంగించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రకారం రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మరోమారు స్పష్టం చేశారు. ఇప్పటికే రైతులకు సంబంధించి రెండు విడతలుగా రుణమాఫీ చేసినట్లు గుర్తుచేశారు. డ్వాక్రా మహిళలకు సంబంధించి వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమచేశామన్నారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేస్తామని, ఈవిషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. ఫించన్లు నెలనెలా అందిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేకాక ప్రజల స్థితిగతులను గుర్తించి కొత్త పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విభజన తర్వాత ఎన్నో ఒడిదుడుకులు, అడ్డంకులు ఎదురవుతున్నా రాష్ట్భ్రావృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. సన్న, చిన్నకారు రైతులు, పేదల సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతిపక్షాల విమర్శలను కొట్టిపారేశారు. అధికారం లేదనే అక్కసుతో చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈసందర్భంగా ఆయన పోరాటనగర్, వెదురుబీడెం, కనిమెర్లతండా, చంద్రాల గ్రామాల్లో పర్యటించారు. ఏఎంసి చైర్మన్ ధనేకుల సాంబశివరావు, వైస్ చైర్మన్ పరికెల నాగేశ్వరరావు, ఎంపిపి బాణావతు లక్ష్మి, వైస్ ఎంపిపి శోభన్‌బాబు, జెడ్పీటిసి రాము, తదితరులు పాల్గొన్నారు.

భారీగా కల్తీ కారం
బస్తాలు స్వాధీనం

కంచికచర్ల, నవంబర్ 30: వేముపల్లిలోమంగళవారం కల్తీ కారం బస్తాలను స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు బుధవారం కూడా దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున కల్తీ కారం బస్తాలను పట్టుకుని సీజ్ చేశారు. విజిలెన్స్ సిఐ అపర్ణ ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఈశ్వరరావు, తహశీల్దార్ విజయకుమార్‌లు సిబ్బందితో స్థానిక స్ఫూర్తి కోల్డ్ స్టోరేజ్‌లో తనిఖీలు నిర్వహించి 2500 కల్తీ కారం బస్తాలను కనుగొన్నారు. ఇవి ఐదుగురు రైతుల పేర్లతో ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తామని, సంబంధితులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. బినామీ పేర్లతో ఈ నిల్వలు ఉన్నట్లైయితే స్టోరేజ్ యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.

వైభవంగా కార్తీక దీపోత్సవం
నాగాయలంక, నవంబర్ 30: స్థానిక శ్రీరామ పాదక్షేత్రం వద్ద కృష్ణా తీరాన బుధవారం కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని మహిళలు వైభవంగా నిర్వహించారు. ఉదయమే వందలాది మంది మహిళలు కృష్ణానది వద్దకు చేరుకుని అరటిదొప్పలపై ప్రమిదలు ఉంచి కార్తీక దీపాలను వెలిగించారు. ఈ వేడుకను చూసేందుకు స్థానికులేగాక పరిసర గ్రామాల ప్రజలు తరలివచ్చారు. కార్తీక మాసం ముగింపును పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుక ఆహ్లాదం నింపింది. కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని శ్రీరామ పాదక్షేత్రం అభివృద్ధి కమిటీ చైర్మన్ ఆలూరి శ్రీనివాసరావు, శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ చిట్టా సాంబశివరావు, వివిధ ఆలయాల అర్చకులు పర్యవేక్షించారు.
డెంగ్యూతో
యువకుని మృతి
మైలవరం, నవంబర్ 30: డెంగ్యూతో ఒక వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని చండ్రగూడెం శివారు జంగాలపల్లి గ్రామానికి చెందిన మత్తి వెంకటేశ్వరరావు(22)కు నాలుగు రోజులుగా తీవ్ర జ్వరం వస్తోంది.