కృష్ణ

గిట్టుబాటు ధర కల్పించడానికే ధాన్యం కొనుగోళ్ళు * మంత్రి ఉమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, డిసెంబర్ 7: రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. మండల పరిధిలోని వెలగలేరు మార్కెట్ యార్డులో ఆయన బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉమ మాట్లాడుతూ పట్టిసీమ ద్వారా విడుదలైన ఒండ్రుమట్టితో కూడిన గోదావరి నీటితో ధాన్యం దిగుబడులు పెరిగాయన్నారు. ఎ గ్రేడు ధాన్యానికి క్వింటాకు రూ.1510లు, సాధారణ రకానికి క్వింటాకు రూ.1470లు ధరగా నిర్ణయించామన్నారు. రైతులు దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు ధాన్యాన్ని అమ్ముకోవాలన్నారు. అప్పుల ఊబిలో ఉన్నా సిఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీని అమలు చేశారన్నారు. సాగునీటిని చెరువులన్నింటికీ మళ్ళించామన్నారు. ఎన్‌ఎస్‌పి ద్వారా కృష్ణాజలాలు, పట్టిసీమ ద్వారా గోదావరి జలాలతో చెరువులు కళకళలాడుతున్నాయన్నారు. కోడూరుకు చెందిన పూజిత రైతుమిత్ర గ్రూపుకు వరికోత యంత్రాన్ని పంపిణీ చేశారు. ఎఎంసి చైర్మన్ ధనేకుల సాంబశివరావు, ఎఎంసి డైరెక్టర్ మంచినీళ్ళ రాజశేఖర్, మంగలంపాటి వెంకటేశ్వరరావు, కొల్లి నాగేశ్వరరావు, టిడిపి యువనేత కుందేటి శ్రీనివాస్, వుయ్యూరు చంద్రశేఖర్, పటాపంచుల నరసింహారావు, చారుగండ్ల ప్రసాద్, తహశీల్దార్ కె సుధారాణి, ఆర్‌ఐ డి రామకృష్ణ, వెలుగు ఎపిఎం బొలగాని రామకృష్ణ, ఎసి రంగారావు తదితరులు పాల్గొన్నారు.