కృష్ణ

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, డిసెంబర్ 7: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందించటమే ధ్యేయంగా కృషి జరగాలని కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి స్వామీజీలు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని కృష్ణా పుష్కర ఘాట్ వద్ద కంచికామకోటి పరమాచార్య చంద్రశేఖర స్వామీజి వారి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం గాంధీ క్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో స్వామీజీలు భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణ చేశారు. ఈ ఆధునిక సంస్కృతి మధ్య ఆధ్యాత్మికతతో పరిరక్షించుకోవాలని, శాంతిపై దృష్టిని మరల్చి సంతృప్తి జీవనం కోసం ప్రతి మానవుడు కృషి చేయాలన్నారు. భక్తి, సదాచారం, న్యాయ పరిపాలన ద్వారానే అభివృద్ధి సాధ్యపడుతుందని, అందుకు ధార్మిక నర్సరీలు ఏర్పాటు చేయాలన్నారు. సరళమైన కళలు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇందుకోసం ఇటీవల శ్రీకాళహస్తిలో నిర్వహించిన సదస్సులో ప్రాచీన గ్రామీణ పద్ధతులు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలని సదస్సులో నిర్ణయించటం జరిగిందన్నారు. శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ 1967లో కంచి పరమాచార్య అవనిగడ్డలో మకాం చేసి 12 రోజులు పాటు కొత్తపేట కృష్ణానదిలో పుణ్య స్నానం ఆచరించారని, అందుకు గుర్తుగానే వారి శిలాఫలకం ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం శ్రీ లంకమ్మ అమ్మవారి ఆలయంలో దాదాపు రూ.7లక్షల వ్యయంతో నిర్మించిన అర్చనా మండపాన్ని స్వామీజి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇఓ వేణుగోపాలరావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే చిట్టి చంద్రశేఖర శాస్ర్తీ ఘనాపాఠి గృహంలో స్వామివారి పాదపూజ కార్యక్రమం నిర్వహించారు.