కృష్ణ

రాజధాని రైతులకు ప్లాట్ల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 24: అమరావతి రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం రైతులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్లాట్ల కేటాయింపు జరిగింది. శనివారం తుళ్లూరులోని ఎపిసిఆర్‌డిఎ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ లాటరీ విధానంతో ప్లాట్లను కేటాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ పట్టారైతుల తోపాటుగా అసైన్డ్, లంక రైతులకు కూడా ఒకే చోట ప్లాట్లు కేటాయించేలా సిఎం అంగీకరించారని, సాగులో ఉన్న వారికి పట్టాలు లేకపోయినా నిబంధనలకు మార్పులు చేసి ప్రత్యేక ప్యాకేజీ సాధించామన్నారు. రెండో విడత నోటిఫికేషన్ జారీ చేసి వారికి కూడా ప్లాట్ల కేటాయింపును త్వరలో చేపడతామన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు పనులలో 7రోడ్ల టెండర్లు పూర్తయినాయన్నారు. రైతులకిచ్చిన పాట్ల లే అవుట్లలో ఇంటిగ్రేటెడ్ అభివృద్ధికి మార్చిలోగా టెండర్ ప్రక్రియను పూర్తిచేస్తామన్నారు. గుంటూరు జెసి కృతికా శుక్లా మాట్లాడుతూ రాజధాని లంక భూముల సర్వేకు స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసామన్నారు. ఈ సందర్భంగా లింగాయపాలెం నకు చెందిన 453 మంది రైతులు 863.8506 ఎకరాల భూమిని సమీకరణలో ఇవ్వగా వీరికి 748 రెసిడెన్షియల్ ప్లాట్లను 8,17,730 చదరపు గజాలు అనగా సుమారు 168 ఎకరాలను పంపిణీ చేసారు. అలాగే 528 కమర్షియల్ ప్లాట్లను 3,81,480 చదరపు గజాలు (78.82 ఎకరాలు) లను ప్లాట్లుగా విభజించారు. అలాగే ఉద్దండరాయునిపాలెం నుంచి 251 మంది రైతులు 378.5750 ఎకరాల భూమిని సమీకరణలో ఇవ్వగా వీరికి 349 రెసిడెన్షియల్ ప్లాట్లు, 254 కమర్షియల్ ప్లాట్లను కేటాయించారు. ఈ కార్యక్రమం తుళ్లూరు ఎంపిపి వడ్లమూడి పద్మలత, జడ్పీటిసి బెజవాడ నరేంద్రబాబు, తాడికొండ మార్కెట్ చైర్మన్ బెల్లంకొడ నరసింహరావు, లింగాయపాలెం సర్పంచ్ ఎ కృష్ణమూర్తి, ఉద్దండరాయునిపాలెం సర్పంచ్ బత్తుల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

భవానీలతో పోటెత్తిన్న ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రి, డిసెంబర్ 24: ఇరుముడులను ధరించిన భవానీలు దుర్గా భవానీకి జై , జై దుర్గా అంటూ శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. ఉభయ రాష్ట్రాల్లోని భవానీదీక్షాధారులు దుర్గమ్మ సన్నిధిలో దీక్షలను విరమించేందుకు తరలివచ్చారు. శనివారం పూర్ణాహుతి ప్రారంభానికి ముందుగానే ఈ దీక్షల విరమణ చేయాల్సి ఉన్న కారణంగానే శుక్రవారం రాత్రి 12గంటలకు ప్రారంభమైన భవానీల రద్దీ శనివారం సాయంత్రం వరకు కొనసాగింది. దీంతో శనివారం వేకువ జామున 3గంటలనుండే ఆలయాధికారులు భవానీలకు అమ్మవారిని దర్శించుకోనే విధంగా ఏర్పాట్లు చేశారు. నగరానికి చేరుకున్న భవానీలు నదిలో స్నానాలు ఆచరించి గురుభవానీల ఆధ్వర్యంలో ఇరుముడులకు పూజలు నిర్వహించుకున్నారు. దుర్గమ్మను కీర్తిస్తూ ఇంద్రకీలాద్రి చుట్టు గిరిప్రదక్షణ చేసి కెనాల్‌రోడ్ వినాయకుడి గుడి వద్ద ఉన్న క్యూమార్గం గుండా కొండపైకి చేరుకొని అమ్మవారి దర్శనం చేసుకొని మల్లిఖార్జునస్వామివార్ల మెట్ల మార్గం గుండా కిందకు చేరుకొన్నారు. శ్రీ మల్లిఖార్జున మహామండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక హోమగుండాల్లో ఇరుముడులను సమర్పించుకొని దీక్షమాలను గురుభవానీల ఆధ్వర్యంలో తీయించుకున్నారు. అర్జున వీధిలోని ఉచిత అన్నదాన కేంద్రంలో అమ్మవారి ప్రసాదాలను స్వీకరించారు. మొక్కుబడి ఉన్న భవానీలు విజయవాడ నగరపాలక సంస్ధ కార్పోరేషన్ ఎదుట ఏర్పాటు చేసిన దేవస్థానం కేశఖండనశాలలో తలానీలు సమర్పించుకున్నారు.