కృష్ణ

పుస్తకం విజ్ఞాన సర్వస్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కల్చరల్), జనవరి 4: పుస్తకం విజ్ఞాన

సర్వస్వమని పుస్తకం ద్వారానే నైపుణ్యత

కలుగుతుందని రిజర్వ్‌బ్యాంక్ విశ్రాంత గవర్నర్

దువ్వూరి సుబ్బారావు అన్నారు. విజయవాడ బుక్

ఫెస్టివల్ సొసైటీ పిడబ్ల్యుడి గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న

28వ పుస్తక మహోత్సవంలో ప్రతి ఏటా 4వ తేదీ

గాంధీనగరం ప్రెస్‌క్లబ్ నుంచి ప్రారంభమయ్యే పుస్తక

ప్రియుల పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు.

బుధవారం సాయంత్రం జరిగిన ఈ పాదయాత్రను

డాక్టర్ బివి పట్ట్భారామ్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ పాదయాత్ర బీసెంట్‌రోడ్డు, గవర్నర్‌పేటల మీదుగా

పుస్తక మహోత్సవ ప్రాంగణానికి చేరుకుంది.

పాదయాత్రలో డాక్టర్ జంధ్యాల శంకర్, కొల్లూరి,

బి.బాబ్జీ, ఆకుల పవన్‌కుమార్, దూపాటి

విజయకుమార్ పలు పాఠశాలల విద్యార్థినీ

విద్యార్థులు తదితర నగర ప్రముఖలు పాల్గొన్నారు.

పుస్తక మహోత్సవంలోని సాహిత్య వేదికపై ఆయన

ప్రసంగిస్తూ తన కాలంలో ఎదుర్కొన సంఘటనలపై

తాను పదవీ విరమణ చేసిన అనంతరం ఆంగ్లంలో

ఒక పుస్తకం వ్రాసానని విదేశాలలో

ఆర్థికస్థితిగతులపై ప్రసంగించారు. అదే వేదికపై

మానసిక నిపుణులు బివి పట్టాబిరామ్ రచించిన

మ్యాజిక్ ఆఫ్ మహాత్మ పుస్తకాన్ని విశ్రాంత ఐఎఎస్

అధికారి కె.ప్రభాకరరెడ్డి ఆవిష్కరించారు. ఈ

సందర్భంగా వేదికపై అతిథులు రాష్ట్ర ప్రభుత్వ

శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్

తదితరులు మాట్లాడుతూ మహాత్ముని

గొప్పదనాన్ని వ్యక్తిత్వ వికాస కోణంలో చూపిన

పట్ట్భారామ్ కృషి ప్రశంసనీయమని అన్నారు.

సామాజిక వ్యక్తిగత జీవితంలో మహాత్మాగాంధి

జీవితం స్ఫూర్తినిస్తుందని అన్నారు. పట్ట్భారామ్

మాట్లాడుతూ వ్యక్తి శీలంలో ప్రధానమైన దృక్పథం,

ప్రవర్తన, భావవ్యక్తీకరణ, క్రమశిక్షణలను ఉన్నతంగా

నిర్వహించిన గాంధీ జీవితంలో మానసిక, నిర్వహణ

శాస్త్రం తదితరాలకు సంబంధించిన

మూలసూత్రాలన్ని ఆచరణలో గమనించాలని

మానసిక శాస్తవ్రేత్తలంత మహాత్మాగాంధీ జీవిత

చరిత్ర లోతుగా చదవి తీరాలని అన్నారు. వేదికపై

బి.బాబ్జీ, దూపాటి విజయకుమార్‌లు పాల్గొన్నారు.