కృష్ణ

అంబరాన్నంటిన మహిళా దినోత్సవ సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 8: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు మంత్రులు ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగిన మహిళా దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాకాయి. తొలుత జ్యోతి ప్రజ్వలనాంతరం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ప్రార్థన గీతంతో సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కళాకారులు కూచిపూడి నృత్యాలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలు, డ్వాక్రా గ్రూప్ మహిళల నృత్యాలు ఎంతగానో అలరించాయి. కరాటే ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీఎం చంద్రబాబు ఎంతో ఓపిగ్గా తిలకరించారు. భారీ ఎత్తున మహిళలు తరలిరావటంతో నిండుదనం చేరుకుంది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్‌ను అతిథులందరూ అభినందించారు. కళాక్షేత్రం వెలుపల ప్రత్యేక స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున మహిళలు తరలివచ్చినప్పటికీ సభ ఎంతో క్రమశిక్షణతో సాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో వివిధ రంగాల్లో రాణించిన 11 మంది మహిళలను సిఎం చంద్రబాబు అవార్డులతో సత్కరించారు. స్వచ్ఛాంద్రప్రదేశ్‌లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థకు చెందిన 8 మంది ఉత్తమ మహిళా పారిశుద్ధ్య కార్మికులను శానిటరీ సోషల్ వర్కర్ కె రాధాకుమారి నేతృత్వంలో సీఎం జ్ఞాపికతో బహుమతులంద చేశారు. వీరిలో బి నూకాలమ్మ (26 డివిజన్), సిహెచ్ నారాయణమ్మ (39), కలేటి దుర్గ (27), బి అచ్చమ్మ (28), పి మరియమ్మ (28), పి కరుణ (21), టి సీతామహాలక్ష్మి (42), వి రాములమ్మ (59) డివిజన్‌లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పీతల సుజాత, దేవినేని ఉమ, ఎంపి కేశినేని నాని, ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, కలెక్టర్ బాబు ఎ, జెడ్‌పి చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు, ఎమ్మెల్యేలు బొండా ఉమ, తంగిరాల సౌమ్య, ఎమ్మెల్సీలు పిజె చంద్రశేఖర్, బచ్చుల అర్జునుడు, కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు, మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గోపి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మహిళా బెటాలియన్ ఏర్పాటు అవశ్యం
* సిఐడి అదనపు డిజి ద్వారకాతిరుమలరావు
* మహిళా సిబ్బందికి ‘పోలీసు ఆత్మీయ సత్కారం’
విజయవాడ (క్రైం), మార్చి 8: ఆడపిల్లలనే కాదని, మగపిల్లలనూ సంస్కరించాల్సిన అవసరం ఉందని సిఐడి అదనపు డిజిపి, నగర ఇన్‌ఛార్జి పోలీసు కమిషనర్ ద్వారాకా తిరుమలరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కమిషనరేట్‌లో వివిధ విభాగాల్లో పని చేస్తున్న పలువురు మహిళా అధికారులు, సిబ్బందిని ఆయన సత్కరించారు. నగర పోలీసు శాఖ ఆధ్వర్యాన కమిషనరేట్‌లోని అన్ని పోలీస్టేషన్ల పరిధిలో ఎంపిక చేసిన కష్టపడి కుటుంబాన్ని నడుపుకుంటూ, పిల్లలను చదివించుకుంటూ స్ఫూర్తిగా నిలిచిన పలువురు మహిళలను ఆయా స్టేషన్లలో బుధవారం సత్కరించారు. ఈక్రమంలోనే కమిషనరేట్‌లోని మహిళా సిబ్బందికి కమిషనర్ కార్యాలయంలో సాయంత్రం పోలీసు ఆత్మీయ సత్కారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. కమిషనరేట్‌లోని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైం, కంట్రోల్ రూము, కమ్యూనికేషన్ విభాగం, పరిపాలనా విభాగం ఇలా ప్రతి వింగ్‌లోనూ ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న 400మంది మహిళా సిబ్బందిలో 42మంది ఎంపిక చేశారు. ఈ ఏడాది ఎంపికైన వీరందరికి శాలువా కప్పి, మెమెంటో ఇచ్చి అభినందించారు. విధుల్లో వీరంతా సమర్ధవంతంగా పని చేసి ప్రతిభ కనపరిచినందుకు మహిళా దినోత్సవం సందర్భంగా సత్కరించారు. ఈసందర్భంగా అదనపు డిజిపి, ఇన్‌ఛార్జి సీపి ద్వారకాతిరుమలరావు మాట్లాడుతూ సమాజంలో స్ర్తి, పురుషుల మధ్య ఆధిక్యత ఉండరాదని, సమానత్వం పెంపొందించుకోవాలన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కేవలం మహిళలకే జాగ్రత్తలు చెప్పడం కాదని, మగపిల్లలకు కూడా మంచిచెడులు నేర్పించాలన్నారు. సమాజంలో ముందుగా వారిని సంస్కరిస్తేనే మహిళకు రక్షణ, గౌరవం ఏర్పడుతుందన్నారు. తమిళనాడు, అస్సాం మాదిరిగా పోలీసు శాఖలో ప్రత్యేకంగా మహిళా బెటాలియన్ ఏర్పాటు కావాల్సిన అవసరముందన్నారు. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తే బావుంటుందన్నారు. ఇక రిక్రూట్‌మెంట్ విషయానికొస్తే.. మూడోవంతు అవకాశం బదులు 15శాతం వరకు వెసులుబాటు కల్పిస్తే బావుంటుందన్నారు. ఈ కార్యక్రమానికి డిసిపి పాలరాజు అధ్యక్షత వహించగా జాయింట్ సీపి పి హరికుమార్, డిసిపిలు జివిజి అశోక్‌కుమార్, అమర్‌నాధ్, మాజీ ఎంపి చెన్నుపాటి విద్య తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ కార్పొరేషన్‌లో కోలాహలం
మచిలీపట్నం (కోనేరుసెంటర్), మార్చి 8: కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో కోలాహల వాతావరణం నెలకొంది. ఎన్‌ఎస్‌ఎఫ్‌డిసి కింద రుణ మంజూరు దరఖాస్తుదారుల ఇంటర్వ్యూలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఎన్‌ఎస్‌ఎఫ్‌డిసి కింద జిల్లాకు 178 యూనిట్లు మంజూరు కాగా 1240 మంది ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. తొలి రోజైన బుధవారం బందరు డివిజన్‌కు సంబంధించిన దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్‌వివి సత్యనారాయణ దరఖాస్తుదారులను ఇంటర్వ్యూ చేశారు. మొత్తం 191 మంది దరఖాస్తుదారులకు గాను 157 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంటర్వ్యూలు జరగ్గా కోలాహల వాతావరణం ఏర్పడింది. దరఖాస్తుదారులు అధిక శాతం మంది మహిళలు ఉండటం విశేషం.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే దరఖాస్తుదారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇడి సత్యనారాయణ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ధ్రువపత్రాల పరిశీలనకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఎండ వేడమి దృష్ట్యా కార్యాలయం ఎదుట షామియానాలు, కుర్చీలను వేయించారు. అలాగే మంచినీటి వసతి కల్పించారు. గురువారం గుడివాడ డివిజన్‌కు సంబంధించిన దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఇడి సత్యనారాయణ తెలిపారు.