కృష్ణ

ధర్మాన్ని కాపాడాలి * శోభాయాత్రలో శివ స్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), ఏప్రిల్ 5: ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉండవల్లి శివమఠాధిపతి శివస్వామి అన్నారు. ధర్మాన్ని రక్షిస్తే అది మనలను రక్షిస్తుందన్నారు. ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రమూర్తి జన్మస్థలమైన అయోధ్యలో భవ్యమైన శ్రీరామమందిరం నిర్మించాలని కోరుతూ బుధవారం పురవీధులలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కోనేరుసెంటరులో నిర్వహించిన బహిరంగ సభలో శివస్వామి మాట్లాడుతూ ధర్మోరక్షతి రక్షితః అని మన పురాణాలు చెబుతున్నాయన్నారు. స్ర్తిలను గౌరవించాలని, అన్ని కులాలవారిని సమానంగా గౌరవించాలన్నారు. తొలుత చిలకలపూడి శ్రీపాండురంగ స్వామి ఆలయం నుండి శోభాయాత్ర పురవీధుల గుండా కోనేరుసెంటరు మీదుగా శ్రీ పాండురంగ స్వామి ఆలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సోడిశెట్టి బాలాజీ, పంతం వెంకట గజేంద్రరావు, కరెడ్ల సుశీల, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, వైవిఆర్ పాండు రంగారావు, కూనపరెడ్డి శ్రీనివాసరావు, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పాల్గొన్నారు.

19వ వార్డులో కాంగ్రెస్ బైక్ ర్యాలీ
గుడివాడ, ఏప్రిల్ 5: ఈ నెల 9వ తేదీన జరిగే ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి స్థానిక 19వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి కూరేటి శ్యామ్‌కుమార్‌ను గెల్పించాలని ఓటర్లను అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి శిష్ట్లా దత్తాత్రేయులు, పట్టణ అధ్యక్షుడు వీరిశెట్టి వెంకట నరసింహారావు పాల్గొన్నారు.

వయోవృద్ధులకు ఇంటివద్దే ఆధార్ నమోదు
గన్నవరం, ఏప్రిల్ 5: ఆధార్ కార్డులు లేని వయోవృద్ధుల ఇంటివద్దకు వెళ్లి కొత్త ఆధార్ కార్డులు నమోదు చేయడం అభినందనీయమని పురుషోత్తపట్నం సర్పంచ్ కొడాలి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం గన్నవరం గరుడా ఆన్‌లైన్ సంస్థ డైరెక్టర్ చైతన్య ఆధార్ కార్డులు నమోదు చేశారు. నడవలేక మంచానపడిన వారి ఇంటి వద్దకు వెళ్లి ఆధార్ నమోదు చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా 22 మంది వయో వృద్ధులకు ఆధార్ కార్డుల వివరాలను నమోదు చేశారు. జంపన సుమ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.