కృష్ణ

జాతీయ స్థాయి ఒంగోలు జాతి పశుప్రదర్శన, పూటీ లాగుడు పోటీలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి, ఏప్రిల్ 7: మండల కేంద్రం మోపిదేవి శివారు రావివారిపాలెం వద్ద జాతీయ స్థాయి ఒంగోలు వృషభ రాజముల పూటీ లాగుడు, బండ లాగుడు పోటీలను రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుజాతి కీర్తి దశదిశలా వ్యాపించేలా జాతీయ స్థాయి ఒంగోలు వృషభ రాజముల ప్రదర్శన నిర్వహించటం గర్వకారణమన్నారు. ఒంగోలు జాతిని ఆస్ట్రేలియా దేశంలో అత్యంత ఆసక్తితో అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా తెలుగువన్ ఫౌండేషన్ అధ్యక్షుడు కంఠమనేని రవిశంకర్ మాట్లాడుతూ జాతీయ స్థాయి పశుప్రదర్శన స్వగ్రామంలో నిర్వహించటం హర్షణీయమన్నారు. పచ్చిమ కృష్ణా వీరులపాడు మండలం నందలూరు గ్రామానికి చెందిన చండ్ర వెంకటేశ్వరరావు ఎడ్ల జత యజమాని చండ్ర వెంకటేశ్వరరావును ఉప సభాపతి సత్కరించి జ్ఞాపికను అందచేసి ఆయన ఎడ్ల జతతో పోటీలను ప్రారంభించారు. గుంటూరు జిల్లాకు చెందిన కంచెల గోపాల్‌రెడ్డి ఎడ్ల జత, కృష్ణా జిల్లా కోసూరువారిపాలెంకు చెంది కోసూరు రవీంద్రరావు ఎడ్ల జత సత్తా చాటుతున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజం, జెడ్పీటిసి సభ్యుడు యం మల్లిఖార్జునరావు, ఎంపిపి యం జయలక్ష్మి, కోడూరు జెడ్పీటిసి బండే శ్రీనివాసరావు, స్థానిక పిఎసిఎస్ అధ్యక్షుడు పి అంజియ్య, శరత్ చంద్రబాబు, మద్దిపట్ల జగన్మోహనరావు, నిడమానూరు దిలీప్ కుమార్, ఎంపిటిసిలు యక్కటి హనుమాన్ ప్రసాద్, దుర్గా నాగేశ్వరరావు, మార్కెట్ యార్డు చైర్మన్ మండవ బాలవర్థిరాజు, మండల టిడిపి అధ్యక్షుడు శీలం శ్రీరాములు, నిర్వహకులు కంఠమనేని శివశంకర్, రావి ప్రభుదాస్, దేవినేని వెంకట సుబ్రహ్మణ్యం, రిఫరీలు సూరపనేని రాధాకృష్ణ, కె కాంతిరెడ్డి, ఎం రమేష్ పాల్గొన్నారు.

మోటారు సైకిళ్ల దొంగ అరెస్టు
* 13 బైక్‌లు స్వాధీనం
నాగాయలంక, ఏప్రిల్ 7: గత కొంతకాలంగా వివిధ ప్రాంతాలలో మోటారు సైకిళ్లను దొంగిలిస్తున్న వ్యక్తి నాగాయలంక పోలీసులకు పట్టుబడ్డాడు. అవనిగడ్డ డిఎస్పీ సయ్యద్ ఖాదర్ భాషా శుక్రవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపారు. ఇదే మండలంలోని ఏటిమొగ గ్రామానికి చెందిన తిరుమలశెట్టి నాగరాజు అనే వ్యక్తి గత ఐదు సంవత్సరాలుగా విజయవాడలో నివాసం ఉంటున్నాడు. ఈనెల 2న నాగాయలంక సంతమార్కెట్‌లో ఓ మోటారు బైక్ దొంగతనానికి గురికావడంతో పోలీసులు వలపన్ని అసలు నిందితుడిని చాకచక్యంగా పట్టుకోగలిగారని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన నాగరాజు దుర్వేసనాలకు లోనై మోటారు సైకిళ్లను దొంగిలిస్తూ తక్కువ ధరకు ఇతరులకు అమ్మినట్లు విచారణలో వెల్లడైందని డిఎస్పీ తెలిపారు. నిందితుడు నాగరాజుతో పాటు స్వాధీనం చేసుకున్న మోటారు సైకిళ్లను అవనిగడ్డలోని న్యాయ స్థానానికి అప్పగించటం జరిగిందని డిఎస్పీ భాషా వివరించారు. నాగాయలంక ఎస్‌ఐ కె రాజారెడ్డి కేసునమోదు చేశారు.
రైతుల సంక్షేమం కోసం తక్కువ వడ్డీకే రుణాలు
* కెడిసిసిబి వైస్ చైర్మన్ రాంబాబు
జి.కొండూరు, ఏప్రిల్ 7: రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కెడిసిసిబి, సొసైటీల ద్వారా తక్కువ వడ్డీలకే రుణాలను మంజూరు చేస్తున్నట్లు కెడిసిసిబి వైస్ చైర్మన్ వేములకొండ రాంబాబు పేర్కొన్నారు. జి.కొండూరు సొసైటీలో సకాలంలో రుణాలు చెల్లించిన 18 మంది రైతులకు 2 శాతం వడ్డీని తిరిగి శుక్రవారం రైతులకు చెల్లించారు. జి.కొండూరు సొసైటీ సభ్యులు వేములకొండ కోటేశ్వరరావు ఇటీవల మరణించగా, ఆయన భార్య మంగమ్మకు రూ.1లక్ష ఇన్సూరెన్సును చెల్లించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల కోసం కొత్తగా కర్షకమిత్ర పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. నిబంధనల ప్రకారం రైతుకు గరిష్టంగా రూ.10 లక్షల రుణాన్ని మంజూరు చేస్తున్నామని, దీన్ని రైతుల ఖాతాల్లో జమచేస్తామన్నారు. రైతులు వాడుకున్న మొత్తానికే వడ్డీ చెల్లించే విధంగా పథకాన్ని రూపొందించినట్లు వివరించారు. బ్యాంకు టర్నోవర్ రూ.1.19 కోట్ల నుంచి రూ.4.81 కోట్లకు పెంచామన్నారు. ఎస్‌ఒడి రుణాలు రూ.25 లక్షలు మంజూరు చేశామన్నారు. రైతులు సకాలంలో రుణాలు చెల్లిస్తూ వడ్డీ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సొసైటీ డైరెక్టర్లు, కార్యదర్శి శ్రీహరి, నాగరాజు, ముప్పూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
పార్టీ ఎమ్మెల్యేలచే రాజీనామా చేయించండి
జగ్గయ్యపేట, ఏప్రిల్ 7: పార్టీ మారిన ఎమ్మెల్యేలచే రాజీనామా చేయించి మరలా గెలిపించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జగ్గయ్యపేటలో ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో పట్టణ వీధుల్లో ప్రదర్శనగా సాగి మున్సిపల్ సెంటర్‌లో మానవ హారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రలోభాలకు గురిచేసి వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి తీసుకున్న 21 మంది ఎమ్మెల్యేలచే రాజీనామా చేయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అక్బర్, పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షుడు చౌడవరపు జగదీష్ తదితర నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.