కృష్ణ

ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలతో విస్తృత ప్రయోజనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 7: అర్బన్ హెల్త్ సెంటర్లలో కూడా కార్పొరేట్ వైద్య సదుపాయాలను అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల పేరిట ఆన్‌లైన్ వైద్య కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నట్టు ఎమ్మెల్యే బొండ ఉమమహేశ్వరరావు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 222 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను శుక్రవారం లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధురానగర్‌లో ఏర్పాటుచేసిన సిఎం ఆరోగ్య కేంద్రం ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే ఉమ మాట్లాడుతూ ఆన్‌లైన్ వైద్య కేంద్రాల ద్వారి విస్తృత ప్రయోజనాలున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 165 కేంద్రాల్లో అపోలో హాస్పటల్ భాగస్వామ్యంతో మెరుగైన సదుపాయాలను కల్పించి 27కు పైగా వైద్య పరీక్షలను ఉచితంగా అందించి పేదవారికి వైద్యపరంగా తగు భరోసా కల్పిస్తున్నామన్నారు. ఎన్‌టిఆర్ వైద్య సేవల ద్వారా రెండున్నర లక్షల రూపాయల వరకూ ఉచిత వైద్యాన్ని అందిస్తున్న వైనంతో రాష్ట్ర ప్రజలు పొందుతున్న వైద్య సేవలతోపాటు ఆన్‌లైన్ వైద్య సేవలందించే ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు కూడా విస్తృత వైద్య సేవలందిస్తానయని తెలిపారు. ప్రస్తుత ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో మానసిక కృంగుబాటు అంశాన్ని ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగిందని, ప్రపంచ వ్యాప్తంగా సుమారు 88 లక్షల మంది మృతికి కారణమవుతున్న మానసిక కృంగుబాటు మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, కుటుంబీకుల మధ్య అనుబంధం తదితర అంశాల వలన మానసిక కృంగుబాటు తనం తక్కువ స్థాయిలో నమోదవుతోందన్నారు. ఒత్తిడిలను తట్టుకునేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స, కౌనె్సలింగ్, నిర్వహించాలని ఆయన కోరారు. పదేళ్ల పాలనలో వైద్య ఆరోగ్య రంగాలను నిర్వీర్యం చేసిన గత ప్రభుత్వాల చర్యలను నిలువరుస్తూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగాలకు అధిక ప్రాధాన్యత నివ్వడం జరిగిందన్నారు. జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ గంథం చంద్రుడు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు 35 కేంద్రాలను సిఎం ఆరోగ్య కేంద్రాలుగా మెరుగుపర్చడం జరిగిందన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ ఆరోగ్య కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ఆపోలో సంస్థకు రోజుకు 13వేల 500 చొప్పున 35 కేంద్రాలకు గాను కోటి 40 లక్షల రూపాయలు, సంవత్సరానికి 17కోట్ల రూపాయలు, రాష్ట్ర వ్యాప్తంగా 220 కోట్లను జిల్లా తరఫున ప్రభుత్వం చెల్లిస్తున్న తరుణంలో ఈ సేవలను ప్రజలు అన్ని విధాలా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెడికల్ ఆఫీసర్‌తో కలిపి వైద్య సిబ్బంది 10 మంది నిరంతరం వైద్య సేవలందిస్తారని తెలిపారు. నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, ఇన్‌చార్జ్ సబ్ కలెక్టర్ చక్రపాణి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వై కామేశ్వరప్రసాద్, అర్బన్ తహశీల్ధార్ ఆర్ శివరావు, 45వ డివిజన్ కార్పొరేటర్ ఆత్కూరి రవికుమార్, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ జ్యోతిర్మయ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అవార్డులలో బెస్‌ట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా ఇబ్రహీంపట్నం సెంటర్ ప్రథమ, పెనుగంచిప్రోలు సెంటర్ ద్వితియ స్థానం గెలుపొందగా, బెస్ట్ సబ్ సెంటర్ గా కొణతాత్మకూరు, రెండవ బెస్ట్ సెంటర్‌గా నందిగామ సెంటర్లు గెలుపొందాయి. విశేష ప్రతిభ కనపరుస్తూ ఉత్తవ సేవలందిస్తున్న హాస్పటల్స్ అందించే కాయకల్ప అవార్డులకు గాను బెస్ట్ హాస్పటల్‌గా మచిలీపట్నం జిల్లా హాస్పటల్ ఏరియా బెస్ట్ హాస్పటల్‌గా నూజివీడు హాస్పటల్, బెస్ట్ కమ్యూనిటీ హాస్పటల్‌గా గన్నవరం హాస్పటల్, రెండవ బెస్ట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా జగ్గయ్యపేట, బెస్ట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా చాట్రాయి లకు ఆయా ఆవార్డులను అందజేశారు.