కృష్ణ

సిఎంను కలిసిన కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 22: జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన బాలయ్య నాయుడు లక్ష్మీకాంతం శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని సిఎం నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లి అర్హులందరికీ లబ్ది చేకూర్చే విధంగా పాలన సాగించాలని నూతన కలెక్టర్‌కు సూచించారు. అలాగే రాజధాని నిర్మాణం నేపథ్యంలో జిల్లాకు అత్యధిక ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పలు మేజర్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా కూడా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని కలెక్టర్ లక్ష్మీకాంతం సిఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు.

అర్చకుల సమస్యలను పరిష్కరిస్తాం
గుడివాడ, ఏప్రిల్ 22: జిల్లాలో అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని దేవాదాయశాఖ సహాయక కమిషనర్ వి సత్యనారాయణ చెప్పారు. శనివారం స్థానిక పాటిమీద ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థాన సమావేశ మందిరంలో గుడివాడ డివిజన్‌లోని దేవాదాయశాఖ అధికారులు, అర్చకులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ అర్చకుల సమస్యలను గుర్తించేందుకు జిల్లాలోని అన్ని డివిజన్‌లలో సమావేశాలను నిర్వహిస్తున్నామన్నారు. పెండింగ్ జీతాలు, కారుణ్య నియామకాలు తదితరాలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. అర్చకులు ఇటువంటి సమావేశాల్లో సమస్యలను వినతిపత్రాల రూపంలో అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ డివిజన్ ఇన్స్‌పెక్టర్ టివిఎస్‌ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.