కృష్ణ

పట్టణంలో మలేరియా దినోత్సవ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 25: పరిసరాల పరిశుభ్రతతో దోమలను నిర్మూలించి, మలేరియాను అంతమొందించాలని మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, మలేరియా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన చైర్మన్ మాట్లాడుతూ ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు వ్యాప్తి చెందకుండా మనవంతు కృషి చేసి మలేరియాను నిర్మూలించాలన్నారు. అసిస్టెంట్ మలేరియా డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు ఎం యలమంద, కె కోటేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్ అబ్బయ్య, సిబ్బంది, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పి రఘు, ఉదయ భాస్కరరావు, బిపికెవిఎస్ సుబ్రహ్మణ్యం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

వైద్య సేవల్లో దేశంలో ఆంధ్ర ప్రదేశ్ అగ్రగామి
జగ్గయ్యపేట, ఏప్రిల్ 25: వైద్య సేవలను అందించటంలో దేశంలో ఆంధ్ర ప్రదేశ్ అగ్రగామిగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో రూ. 207.50 లక్షలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా ప్రభుత్వం వైద్యశాలలో సేవలు అందిస్తున్నామని అన్నారు. వైద్యశాలలో ప్రసవం అంటే పిల్లలకు బెబీకిట్, తల్లులకు మదర్ కిట్‌లను అందిస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలా సహాయం అందిస్తోందని వివరించారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ వైద్యశాలకు కావాల్సిన సదుపాయాల గురించి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సభలో ఎంపి కేశినేని శ్రీనివాస్, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్, మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. సభలో వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ వై వెంకటలక్ష్మి, ఫ్లోర్‌లీడర్ రాఘవ, వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారులు, బిజెపి నేతలు కోడాలి మల్లికార్జున ప్రసాద్, కీసర రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

బస్సు ఢీకొని యువకుడి మృతి
కలిదిండి, ఏప్రిల్ 25: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో రాష్ట్ర రహదారిపై మంగళవారం బస్సు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల వివరాలు ప్రకారం మండలంలోని కొచ్చర్ల గ్రామానికి చెందిన అంబటి అనిల్‌కుమార్ (23) కోరుకొల్లు చేపల మందుల దుకాణంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అనిల్‌కుమార్ తన మోటారు సైకిల్‌పై కోరుకొల్లు నుండి కలిదిండి వస్తుండగా మెట్రో బస్సు ఢీకొనటంతో చక్రాల కింద తలకాయ పడి నుజ్జునుజ్జవటంతో అనిల్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కానిస్టేబుల్‌గా సెలక్ట్ అయ్యాడు. మృతదేహాన్ని కైకలూరు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎస్‌ఐ గౌతమ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మహిళలను వేధిస్తున్న వ్యక్తి అరెస్టు

నూజివీడు, ఏప్రిల్ 24: మహిళలకు మాయమాటలు చెప్పి మోసం చేసిన వ్యక్తిని నూజివీడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక సిఐ కార్యాలయంలో మంగళవారం డిఎస్‌పి వి శ్రీనివాసరావు విలేఖరులతో మాట్లాడుతూ బాపులపాడు మండలం శేరీనరసన్నపాలెం గ్రామానికి చెందిన సింగం అనిల్‌కుమార్ (24) పలువురు మహిళలకు మాయమాటలు చెప్పి ప్రేమ పెళ్ళి పేరుతో వారిని లోబర్చుకున్నాడని చెప్పారు. కొంతమంది మహిళల నగ్న దృశ్యాలను చిత్రీకరించి ఫేస్‌బుక్‌లో పెడతానని బెదిరించి, శారీరకంగా లోబర్చుకున్నాడని, అంతేగాక వారి వద్ద నుండి బంగారు అభరణాలు, నగదు తీసుకుని విలాసాలకు వాడుకున్నాడని తెలిపారు. అనిల్‌కుమార్‌పై ఫిర్యాదులు కూడా రావటంతో నిఘా ఏర్పాటు చేశామని మంగళవారం ఉదయం ఏలూరు బస్టాండ్ వద్ద ఉన్నట్లు సమాచారం అందటంతో వలపన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. నిర్భయ చట్టం కింద కేసునమోదు చేసి కోర్టుకు హాజరు పర్చామని డిఎస్‌పి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమావేశంలో సిఐ రామ్‌కుమార్, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.