కృష్ణ

భూమి కొనుగోలు పథకానికి ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 26: భూమి కొనుగోలు పథకానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఎస్సీ కార్పొరేషన్ ఇడి ఎన్‌వివి సత్యనారాయణ తెలిపారు. బుధవారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ అర్హులైన ఎస్సీలకు భూమి కొనుగోలు పథకం కింద భూమిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మెట్ట భూములు ఒక్కో వ్యక్తికి మూడు ఎకరాలు, బోరు, బావులు కింద సాగయ్యే భూములు రెండు ఎకరాలు, రెండు పంటలు పండే భూములు ఎకరం చొప్పున పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ముందుకు వచ్చి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు భూములు అమ్ముతామంటే విచారణ నిర్వహించి మండల స్థాయి కమిటీ ఆమోదంపై జిల్లా స్థాయి కమిటీకి పంపిస్తామన్నారు. మెట్ట భూములకు ఎకరాకు రూ.9లక్షలు, బోర్ల కింద సాగయ్యే భూములకు రూ.12లక్షలు, కాలువల కింద సాగయ్యే భూములకు రూ.15లక్షలు ప్రభుత్వం ధర నిర్ణయించిందన్నారు. కనీసం ఐదు ఎకరాలు ఒకే ప్లాట్‌గా ఉంటే తీసుకుంటామన్నారు. ఇప్పటికి 80 ఎకరాలు పరిశీలనలో ఉన్నాయన్నారు. కొనుగోలు ప్రక్రియ పూర్తయిన తరువాత ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ ద్వారా భూములను అభివృద్ధి చేయటం జరుగుతుందన్నారు.

రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషిచేయాలి
నందిగామ, ఏప్రిల్ 26: రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నేతలు కృషి చేయాలని వైకాపా నియోజకవర్గ సమన్వకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు అన్నారు. స్థానిక వైకాపా కార్యాలయంలో బుధవారం పార్టీ పట్టణ సమన్వయ కమిటీని నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు నియోజకవర్గ సమన్వయకమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు. ఒకొక్క మండలానికి 15 మందితో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. పట్టణ కమిటీ సభ్యులు సభ్యులుగా డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్, కోవెలమూడి వెంకట నారాయణ, చల్లా బ్రహ్మేశ్వరరావు, మంగునూరు కొండారెడ్డి, నెలకుదిటి శివనాగేశ్వరరావు, చిరుమామిళ్ల చైతన్యకుమార్, పాములపాటి రమేష్, కత్రోజు శ్రీనివాసాచారి, పసుపులేటి శ్రీనివాసరావు, పత్తిపాటి జయరామారావు, గుడివాడ సాంబశివరావు, మువ్వల శ్రీనివాసరావు, ఖలీల్ అహమ్మద్ రజ్వీ, కుక్కల సత్యనారాయణ ప్రసాద్, తోట అంజారావు, బేరోతుల బాబులను నియమించినట్లు తెలిపారు.

వేసవి దుక్కులతో రోగకారక సిలీంధ్రాలు నాశనం
తోట్లవల్లూరు, ఏప్రిల్ 26: మాగాణి పొలాల్లో రైతులు వేసవి దుక్కులు దున్నించటంతో పాటు పచ్చిరొట్ట ఎరువుల పెంపకానికి ప్రాధన్యం ఇవ్వాలని మండల ఇన్‌చార్జి వ్యవసాయాధికారిణి ఎస్‌కె జరీనా అన్నారు. మండలంలోని రొయ్యూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం వ్యవసాయ కార్యచరణ ప్రణాళికపై రైతులతో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో ఏయే పంటలు పండిస్తారు. కొత్త రకాల వంగడాలను సాగుచేసే రైతుల వివరాలను తెలుసుకున్నారు. వేసవి దుక్కులతో భూమిలోపల దాగివుండే సిలీంధ్రాలు బయటకు వచ్చేసి చనిపోతాయని, తద్వారా పంటలకు మేలు జరుగుతుందన్నారు. అలాగే జీలుగ, పిల్లిపెసర, జనుములాంటి పచ్చిరొట్ట ఎరువులను పెంచాలన్నారు. భూసార పరీక్షల ఆధారంగానే ఎరువులను వాడాలన్నారు. అలాగే వ్యవసాయంలో యాంత్రీకరణను పెంచేందుకు ప్రభుత్వం సబ్సీడీలను ఇస్తోందని, రైతులు కావలసిన యంత్రపరికరాలను తీసుకోవాలని జరీనా తెలిపారు. సర్పంచ్ లుక్కా సుబ్బారావు, విఆర్‌ఓ రామ్‌కుమార్, కార్యదర్శి గంగాధర్ పాల్గొన్నారు. అనంతరం వల్లూరుపాలెంలో గ్రామసభ నిర్వహించారు.