కృష్ణ

మంచినీటి సమస్య నివారిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 26: నీరు-ప్రగతిని ఉద్యమంలా చేపట్టి గ్రామ జల ప్రణాళికతో నీటి సమస్యలేని కరవు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని మండల ప్రత్యేకాధికారులు, ఎంపిడివోలు, తహశీల్దార్లను జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఆదేశించారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా నీరు-ప్రగతి ఎస్‌ఆర్‌ఇజిఎస్, మంచినీరు, ఆర్‌డబ్ల్యుఎస్, గ్రామీణాభివృద్ధి, వివిధ కార్పొరేషన్ల రుణాలు, పౌర సరఫరాలు వంటి పలు అంశాలపై కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నీరు-ప్రగతి కార్యక్రమం ద్వారా కరవు రహితంగా తీర్చిదిద్దేందుకు 90 రోజుల ప్రణాళిక రూపొందించిందన్నారు. దీనిలోభాగంగా జిల్లాలో జలవనరులు, ఎస్‌ఆర్‌ఇజిఎస్, అటవీ, వ్యవసాయం వంటి సంబంధిత శాఖల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలన్నారు. గ్రామస్థాయిలో గ్రామైఖ్య సంఘాలు, వాటర్‌షెడ్ కమిటీలు, సాగునీటి సంఘాలు, వనసంరక్షణ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో నీరు-ప్రగతిని ఉద్యమంగా చేపట్టాలన్నారు. పంటకుంటలు, పూడికతీత, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి వంటి పనులను స్థానిక ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలు రెండు గ్రామ పంచాయతీలను దత్తత తీసుకొని నీటి అవసరాలు, లభ్యత, నీటి వనరుల మ్యాపింగ్ చేపట్టి విద్యార్థులతో ప్రాజెక్టు రిపోర్టు రూపొందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వాటర్ బడ్జెట్ తయారుచేసి భవిష్యత్‌లో ఏ మండలంలోనూ కరవు వుండరాదని ఆదేశించారు. గ్రామస్థాయిలో జరుగుతున్న రోజువారీ పనులను రికార్డులలో నమోదు చేయాలని ఆకస్మిక తనిఖీలో రిజిష్టర్లను పరిశీలిస్తామన్నారు. అన్ని హేబిటేషన్‌లలో పంటకుంటల తవ్వకం పనులు తక్షణమే ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లోను పనుల ప్రగతి కనపర్చాలని, ఆకస్మికంగా పనులను తనిఖీ చేస్తామన్నారు. నేటివరకు లక్షా 15వేల 741 మంది ఉపాధిహామీ కూలీలకు పనులు కల్పించామని, గత మూడురోజుల నుండి ఈ సంఖ్య 18వేలకు పెరగటం పట్ల కలెక్టర్ అధికారులను అభినందించారు. పని బాగాచేస్తే ప్రోత్సాహం ఉంటుందని, చేయకుంటే చర్యలు తప్పవన్నారు. రానున్న సోమవారం నాటికి ప్రగతి చూపాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో నరేగా పనులు జరగాలని, ముఖ్యంగా పాఠశాలల ఆటస్థలాలు, బరియల్ గ్రౌండ్స్, మెరక వంటి అభివృద్ధి పనులు ఉపాధి హామీలో చేపట్టవచ్చని సూచించారు. గృహ నిర్మాణంపై సమీక్షిస్తూ లక్ష్యసాధనలో వెనుకబడిన మండలాల హౌసింగ్ ఎఇలను వ్యక్తిగతంగా కలవాలని ఆదేశించారు. రోజుకు వెయ్యి గృహాలు గ్రౌండింగ్ కావాలని ఆదేశించారు. మంచినీటి సమస్య రానీయకూడదని, ప్రతిరోజూ మంచినీటి సరఫరా వుండాలన్నారు. జిల్లాను స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించేందుకు ఇంకా నిర్మించవల్సిన 32వేల వ్యక్తిగత మరుగుదొడ్లను మే 20 నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. జనరిక్ మెడిసిన్స్ అన్ని మండలాల్లో సామాన్యులకు అందుబాటులో వుంచాలని, దీనిపై స్వయం సహాయక సంఘాల సభ్యులతో విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. సంక్షేమ వసతి హాస్టళ్లలో స్వీకారం కార్యక్రమం ద్వారా స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో కనీస వౌలిక సదుపాయాలు కల్పించేలా సంక్షేమ వసతి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. చౌకధరల దుకాణాల్లో ప్రస్తుతం 75శాతం పైగా నగదు రహిత చెల్లింపులు జరుగుతున్నాయని, రానున్న మాసాంతానికి 90 శాతం నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. పొగరహిత జిల్లాగా దీపం గ్యాస్ కనెక్షన్లు పంపిణీని మే 10నాటికి పొగ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, డిఆర్‌డిఎ పీడీ చంద్రశేఖరరాజు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ శ్రీనివాసరావు, డ్వామా పీడీ రాజగోపాల్, హౌసింగ్ పీడీ ప్రతాపరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.