కృష్ణ

భారీ పోలీస్ బందోబస్తు నడుమ ప్రశాంతంగా మిర్చి కొనుగోళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, మే 18: భారీ పోలీస్ బందోబస్తు నడుమ స్థానిక మార్కెట్ యార్డ్‌లో గురువారం ప్రశాంతంగా మిర్చి కొనుగోళ్లు జరిగాయి. ఆదివారం నిర్వహించాల్సిన కొనుగోళ్లను గురువారానికి వాయిదా వేయడంతో పాటు గత ఆదివారం జరిగిన రైతుల ఆందోళన దృష్యా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. గుంటూరు నుండి వచ్చిన ట్రేడర్స్ (బయ్యర్లు) ఉదయం కొనుగోళ్లను ప్రారంభించగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, సబ్ కలెక్టర్ చక్రపాణి, మార్కెట్ యార్డ్ పిఐసి దాసు, కార్యదర్శి గోవిందు, తహశీల్దార్ శ్రీరామకృష్ణ పరిశీలించి పర్యవేక్షించారు. ఇదే సమయంలో వైసిపి కార్యాలయం నుండి మార్కెట్ యార్డ్‌కు బయలుదేరిన వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ జగన్మోహనరావు, ఆ పార్టీ నాయకులు మంగునూరు కొండారెడ్డి, చిరుమామిళ్ల చైతన్యకుమార్, కొండా కృష్ణారెడ్డి, కొమ్మినేని రవిశంకర్, ఎండి మస్తాన్, కత్రోజు శ్రీనివాసాచారి తదితర నాయకులను డిఎస్‌పి ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు ఇన్స్‌పెక్టర్ సత్యకిషోర్, ఎస్‌ఐలు తులసీరామకృష్ణ, ఏసోబులు సిబ్బందితో వెళ్లి అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేసారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ తీరు, పోలీస్ అధికారుల చర్యలను తీవ్రంగా ఖండించారు. మార్కెట్ యార్డ్ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిఎస్‌పి ఉమామహేశ్వరరావు, ఇన్స్‌పెక్టర్ సత్యకిషోర్‌లు స్వయంగా స్థానిక పోలీస్ సిబ్బంది, ఎఆర్ పార్టీతో బందోబస్తు పర్యవేక్షించారు. ఉదయం నుండి సాయంత్రం వరకూ ప్రశాతంగా కొనుగోళ్లు జరిగాయి. ఎమ్మెల్యే సౌమ్య వెంట చైర్‌పర్సన్ యరగొర్ల పద్మావతి, మండల, పట్టణ తెదేపా అధ్యక్షులు చిరుమామిళ్ల శ్రీనివాసరావు, కొండూరు వెంకట్రావు, చందర్లపాడు జడ్‌పిటిసి వాసిరెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇలావుండగా గురువారం నిర్వహించిన మిర్చి కొనుగోళ్లలో బయ్యర్‌లు 6586 క్వింటాళ్లను కొనుగోలు చేసారు. గత వారం వచ్చిన 1425 క్వింటాళ్లతో పాటు బుధవారం రాత్రి వరకూ వచ్చిన 7062 క్వింటాళ్లతో మొత్తం 8487 క్వింటాళ్లకు గానూ 6586 క్వింటాళ్ల కొనుగోలు జరిగినట్లు కార్యదర్శి గోవిందు తెలిపారు. అత్యధిక ధర రూ.4150లు, అత్యల్పం రూ.1500లు, సరాసరి (యావరేజ్) రూ.2850లు లభించినట్లు తెలిపారు.