కృష్ణ

పోర్టు భూముల కోసం.. ఇంటింటికి వెళ్లి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 25: బందరు పోర్టు భూముల కోసం ప్రజా ప్రతినిధులు గురువారం రైతుల ఇళ్లకు వెళ్లి సుమారు 30 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్‌కు అంగీకారం పొందారు. రాష్ట్ర న్యాయ, క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావుతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు మండల పరిధిలోని పెదకరగ్రహారం గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ల్యాండ్ పూలింగ్‌లో పేర్కొన్న రైతుల ఇళ్లకు వెళ్లిన వారు పోర్టు ప్రాధాన్యత, భవిష్యత్తులో జరగబోయే ఈ ప్రాంత అభివృద్ధిని వివరించారు. అలాగే ల్యాండ్ పూలింగ్‌లో భూములిచ్చే రైతులకు ప్రభుత్వం అందించనున్న ప్యాకేజీపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి రైతుల్ని ల్యాండ్ పూలింగ్‌కు ఒప్పించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోర్టు ద్వారానే బందరు అభివృద్ధి సాధ్యమన్నారు. మన ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కదిలిరావాలన్నారు. పారిశ్రామికంగా మన ప్రాంతం అభివృద్ధి సాధిస్తే మన పిల్లల భవిష్యత్తుకు ఢోకా ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు, టిడిపి సీనియర్ నాయకుడు బూరగడ్డ రమేష్ నాయుడు, టిడిపి మండల అధ్యక్షుడు కుంచే దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.