కృష్ణ

కేంథ్రీకృత వంటశాలలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 26: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని కేంద్రీకృత వంటశాలల ద్వారా అందించాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మిడ్డే మీల్స్ కార్మికులు ఆందోళన బాట పట్టనున్నారు. ప్రతి జిల్లాకు ఐదు కేంద్రీకృత వంటశాలలను ఏర్పాటుచేసి 25వేల మంది విద్యార్థులకు వీటి ద్వారా భోజనం సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇది ఆచరణ సాధ్యం కాదని, దీనివల్ల నాణ్యమైన, వేడి వేడి భోజనాన్ని విద్యార్థులకు అందించడానికి ఏ మాత్రం వీలవదని మిడ్ డే మీల్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.్భగ్యలక్ష్మి చెబుతున్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి స్కూలు వద్ద వేడి భోజనాన్ని సంబంధిత స్కూలు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో అందిస్తున్నామని, ఈ పథకం రాష్టమ్రంతా జయప్రదంగా అమలవుతున్న తరుణంలో కేంద్రీకృత వంటశాలల పేరుతో ప్రైవేట్ వంట ఏజెన్సీలను ప్రోత్సహించడం సరికాదని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం జారీచేసిన తాజా ఉత్తర్వుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వంట ఏజెన్సీల్లో పనిచేస్తున్న సుమారు 80వేల మంది వంట కార్మికులు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడిపోయే పరిస్థితులను కల్పిస్తున్నారన్నారు. గత 15 సంవత్సరాలుగా ఈ పథకంలో పనిచేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం తగదని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయం.. సుప్రీంకోర్టు గతంలో జారీచేసిన మార్గదర్శకాలకు భిన్నంగా ఉందని ఆమె తెలిపారు. ఈ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ఇప్పటివరకు కనీస వేతనాలు లేవని గౌరవ వేతనం పేరుతో కొద్దిమొత్తమే చెల్లిస్తున్నారని ఆమె అన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ సంస్థలకు ఈ పథకాన్ని అప్పజెప్పిన ఫలితంగా కొన్ని దుర్ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. పాడైపోయిన ఆహారం సరఫరా చేయడంతో విద్యార్థుల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని, అందువలన గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి ప్రస్తుత పద్ధతిలోనే ఈ పథకాన్ని కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జూన్ 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించి ఆందోళన చేయనున్నట్టు ఆమె తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా విజ్ఞతతో ఆలోచించి ఈ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు.