కృష్ణ

బందరు పోర్టును నిర్మించి తీరుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 28: బందరు పోర్టుతో ఆంధ్రా ఇతర రాష్ట్రాల మధ్య వాణిజ్య సత్సంబంధాలు పెంచుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు రెండవ రోజైన ఆదివారం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బందరు పోర్టును పునరుద్ఘాటించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసమీకరణ ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. రెండు నెలల్లో పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రకటనతో ఈ ప్రాంత వాసుల్లో ఆశలు చిగురించాయి. ఓడరేవు నిర్మాణానికి సుమారు 5వేల ఎకరాల భూమి, అనుబంధ పరిశ్రమల స్థాపనకు మరో 28వేల ఎకరాలు మొత్తం 33వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే తొలిగా బందరు పోర్టుకు సంబంధించిన 5వేల భూముల సమీకరణపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా 3వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములను కాకినాడ పోర్టు డైరెక్టర్ ద్వారా పోర్టు నిర్మాణ సంస్థ నవయుగకు గతంలో అందజేశారు. మిగిలిన 2వేల పట్టా భూముల సమీకరణపై ముడ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 2వేల ఎకరాల్లో సుమారు 800 ఎకరాలు వరకు సమీకరణ జరగ్గా మిగిలిన భూమిని సమీకరించాల్సి ఉంది.