కృష్ణ

రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), మే 28: పట్టణంలో రంజాన్ ఉపవాస దీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. అత్యంత పవిత్రమైన ఈ మాసంలో ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపట్టారు. ఉదయం 4.9ని.ల నుండి సాయంత్రం 6.37 వరకు ఉపవాసంలో ఉండి అనంతరం మసీదులలో ప్రత్యేక నమాజు చేసి దీక్ష విరమించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు మసీదులను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
కూచిపూడిలో...
కూచిపూడి : మొవ్వ మండలంలో ఆదివారం నుండి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. మండలంలోని పలు గ్రామాలలో ముస్లిం ప్రార్ధనా స్థలాల్లో, మ సీదులలో తెల్లవారుఝామున 4 గంటలకు, మధ్యా హ్నం 1 గంటకు, సాయంత్రం మూడు విడతలు ప్రార్ధనలో పాల్గొని ఖురాన్ పటించి భక్తి ప్రపత్తులను వెల్లడించారు. ఇందులో భాగంగా మండలంలోని పెదపూడి, పెడసనగల్లు, కాజ, మొవ్వ, నిడుమోలు, కోసూరు, కాజ, కేటిపాలెం తదితర గ్రామాలలోని మసీదులలో ఆదివారం జరిగిన నమాజులో ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సురేపల్లిలో చోరి 48 కాసుల బంగారం మాయం
ముసునూరు, మే 28: అర్ధరాత్రి అందరూ ఆరుబయట గాఢనిద్రలో ఉం డగా ఇంటి దక్షణవైపుఉన్న తలుపుగడియ విరగగొట్టి ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు బీరువాను పగులగొట్టి అందులోఉన్న 48కాసుల బంగారపు ఆభరణాలను దోచుకుపోయిన వైనం ఇది. నూజివీడు సిఐ రామ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని సురేపల్లి గ్రామానికి చెందిన వడ్లపట్ల గాంధీ తన కుటుంబ సభ్యులతో శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి ఇంటి ఆవరణలో నిద్రించారు. గాంధీ కుమారుడు నూజివీడు సెకండ్‌షో సినిమాకు వెళ్ళి ఇంటికి వచ్చేసరికి తలుపుతీసి ఉండటం గమనించాడు. ఈవిషయాన్ని తల్లిదండ్రులకు, చుట్టుపక్కలవారికి చెప్పడంతోవారంతా లేచి చూసేసరికి ఇంటిలోఉన్న బీరువా పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఆదివారం ముసునూరు ఎస్‌ఐ కె శివనారాయణ నూజివీడు సిఐ రామ్‌కుమార్‌కు సమాచారం ఇచ్చారు. సిఐ సంఘటన స్థలికి వచ్చి కుటుంబ యజమాని గాంధీ నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చోరికి పాల్పడిన వ్యక్తి ఇంటికి దక్షణవైపుఉన్న తలుపుగడియ విరగగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలో ఉన్న వస్తువులను చిందరవందరగా చేసి అందులోఉన్న 48 కాసుల బంగారు ఆభరణాలను తస్కరించినట్లు సిఐ చెప్పారు. ఇంకా బీరువాలో ఉన్న వెండి ఆభరణాలు, 35వేల రూపాయల నగదు బీరువాలోనే ఉన్నట్లు గుర్తించారు. మచిలీపట్నం నుండి క్లూస్‌టీమ్, డ్వాగ్‌స్క్వాడ్‌లు వచ్చి సంఘటన స్థలంలో వేలిముద్రలు సేకరించారు. ఈసందర్భంగా సిఐ రామ్‌కుమార్ మాట్లాడుతూ ఈ చోరికి పాల్పడిన వ్యక్తి కుటుంబానికి బాగా తెలిసి వ్యక్తి అయ్యి ఉంటాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. గాంధీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు.