కృష్ణ

నేటి నుండి జాతీయ సహస్ర కవి సమ్మేళనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, ఫిబ్రవరి 24: ప్రపంచ శ్రేణి స్వచ్ఛంద సేవా సంస్థ తెలుగులోగిలి ఆధ్వర్యంలో ఈ నెల 25 నుండి మూడు రోజులు పాటు స్థానిక బాలికోన్నత పాఠశాలలో నిర్వహించనున్న జాతీయ సహస్ర కవి సమ్మేళనం, వెయ్యి కవితల పండుగ కార్యక్రమ ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంస్థ చైర్మన్ పీఎస్‌రావ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ వేడుకలను ఉప సభాపతి బుద్ధప్రసాద్ ఆదివారం ప్రారంభిస్తారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, మహిళ కమిషన్ చెర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, ప్రముఖ జర్నలిస్టు తుర్లపాటి కుటుంబరావు, ప్రఖ్యాత కవి, ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరిబాబు, వైసీపీ నేత సింహాద్రి రమేష్‌బాబు తదితరులు హాజరు కానున్నారు.

మహిళలకు చట్టాల పట్ల అవగాహన2

నాగాయలంక, ఫిబ్రవరి 24: మహిళలు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని అవనిగడ్డ ప్రిన్సిపల్ జడ్జి లక్ష్మీనారాయణ అన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో శనివారం మహిళ సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో మహిళలు-చట్టాలు అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జడ్జి మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా హక్కులను కలిగి ఉన్నారన్నారు. సామాజిక భద్రత విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుందని హితవు పలికారు. అడిషినల్ జడ్జి అమర రంగేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు బస్సులలో, రైళ్లల్లో ప్రయాణించే సమయంలో తమకు కేటాయించిన సీట్లలో తామే కూర్చునే విధంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి వెలుగు ఏపీఎం ఎం రత్నం అధ్యక్షత వహించగా వెలుగు ఏసీ అశోక్ కుమార్, వివిధ గ్రామాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.