కృష్ణ

నీతి నిజాయితీలతో లక్ష్యాన్ని అధిగమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), మార్చి 17: ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన చరిత్ర నోబుల్ కళాశాలకు ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. నోబుల్ కళాశాల 175 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం కళాశాలలో నిర్వహించిన వేడుకలు వైభవంగా జరిగాయి. వివిధ రంగాల్లో స్థిరపడి ఉన్నతులుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పూర్వ విద్యార్థులు హాజరై తమ కళాశాల పట్ల తమకున్న ప్రేమాభిమానాన్ని చాటుకున్నారు. కువైట్‌లో భారత రాయబారి, కళాశాల పూర్వ విద్యార్థి కాకరవాడ జీవసాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జీవితంలో భవిష్యత్తుకు పునాది పడింది నోబుల్ కళాశాలలోనే అన్నారు. నీతి నిజాయితీలతో జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి పైకి రావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే, న్యాయ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ దేశంలో స్థాపించిన మూడు విద్యా సంస్థల్లో నోబుల్ కళాశాల మొట్టమొదటిదన్నారు. తాను కూడా ఈ కళాశాల పూర్వ విద్యార్థినేనన్నారు. భోగరాజు పట్ట్భా సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు, విశ్వనాధ సత్యనారాయణ వంటి ఎంతో మంది గొప్పవారిని దేశానికి ఈ కళాశాల అందించిందన్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ మాట్లాడుతూ దేశ విదేశాల్లో మన దేశం తరఫున సేవలు అందించేందుకు ప్రముఖులను అందించిన ఘనత నోబుల్ కళాశాలకు దక్కుతుందన్నారు. నోబుల్ కళాశాల ఒక చరిత్ర, ఒక జ్ఞాపకం, చారిత్రక అనవాళ్లుగా జ్ఞాపకాలు పదిలం చేస్తూ నిలిచిన విద్యా సంస్థ అన్నారు. నోబుల్ విద్యా సంస్థల చైర్మన్, కృష్ణా, గోదావరి డయాసిస్ బిషప్ రైట్ రెవరెండ్ గోదావడ దైవాశీర్వాదం అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు, కళాశాల పూర్వ విద్యార్థులైన తిరుపతి పార్లమెంట్ సభ్యుడు వెలగపల్లి వరప్రసాదరావు, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ముళ్లపూడి బాపిరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు, కృష్ణా విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావు, రిజిస్ట్రార్ పులిపాటి కింగ్, కళాశాల ప్రిన్సిపాల్ అనీల, కార్యదర్శి శామ్యూల్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

ఎటువంటి సవాళ్లకైనా తెలుగుజాతి సై
జగ్గయ్యపేట రూరల్, మార్చి 17: తెలుగు జాతికి ఎలాంటి సవాళ్లు వచ్చినా దీటుగా ఎదుర్కొనే శక్తి ఉందని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. శనివారం మండలంలోని బలుసుపాడు శ్రీగురుధామ్‌ను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌తో కలిసి సతీ సమేతంగా సందర్శించారు. తాత్వికులు గెంటేల వెంకట రమణ, వసంత లక్ష్మి దంపతులు, గురుకుటుంబ సభ్యుల వారికి స్వాగతం పలికారు. సద్గురు కందుకూరి శివానందమూర్తి వారి విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారు సరైన వ్యక్తిత్వాన్ని అందిపుచ్చుకోవాలని, వ్యక్తిత్వ నిర్మాణంలో ఇతర జాతులు, ప్రాంతాల కంటే మనం కొంత వెనుకబడి ఉన్నామన్నారు. పొరుగు రాష్ట్రం తమిళనాడులో మన కంటే అక్కడ తీవ్రమైన రాజకీయాలు ఉంటాయని, పార్టీలు, వ్యక్తుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నా రాష్ట్రానికి సంబంధించి ఏదైనా సమస్య వస్తే అందరూ ఏకతాటిపై నిలబడి సాధించుకునే లక్ష్యం వారికి ఉందన్నారు. మనల్ని మనం సంస్కరించుకొని ఐక్యతతో ముందుకు నడిస్తే ఎదుటి వారిని ఎదుర్కొనే సత్తా మనకు వస్తుందన్నారు. మనలో మనకు అనేక పోరాటాలు జరుగుతాయని, వాటిని పక్కన బెట్టి మనకు సమస్య వచ్చినప్పుడు దాని సాధనకు ఐక్యంగా పోరాటం సాగించాలన్నారు. నేడు రాజకీయాలు వేగవంతంగా మారుతున్నాయని, తన తండ్రి హయాంలో రాజకీయాలకు, నేటి రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. అప్పుడు సేవా దృక్పథం ప్రకారం రాజకీయాలు నడిచేవని, ప్రజలు కూడా సేవ చేసే వారినే ఎన్నికల్లో గెలిపించేవారని, ఇప్పటి రాజకీయాలు మొత్తం ధనంతో ముడిపడి ఉన్నాయని అన్నారు. తనకు ప్రజలు ఇచ్చిన అవకాశం మేరకు నడుచుకొని తన జీవితాన్ని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. చరిత్రలో తెలుగుజాతికి వచ్చినన్ని సవాళ్లు మరో జాతికి రాలేదన్నారు. ఈ ఉగాది తెలుగు వారి ఆకాంక్షలకు వారధిగా నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సద్గురు శివానందమూర్తితో తన సంబంధాన్ని గుర్తు చేసుకొని గురుథామ్‌లో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకొని కొనియాడారు. అనంతరం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేదాద్రి శ్రీయోగానంద లక్ష్మీనర్శింహస్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరాం వరప్రసాదరావు, అర్చకులు, సిబ్బంది మండలి బుద్ద ప్రసాద్ దంపతులను శేషవస్త్రాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను, చిత్రపటాలను అందజేశారు.

అకాల వర్షంతో రైతుల ఆందోళన
తోట్లవల్లూరు, మార్చి 17: శనివారం మధ్యాహ్నం అకాల వర్షం పడటంతో మండలంలోని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్నం సమయంలో హఠత్తుగా కారుమబ్బులు కమ్ముకుని గంట పాటు వర్షం ఎడతెరిపి లేకుండా కూరవటంతో రైతులు ఆందోళన చెందారు. కొంతమంది రైతులు పసుపు ఉన్న కళాలలో పసుపు రాశులపై పరదాలు కప్పారు. లంకలో పసుపు పంట దునె్న పనులు, పసుపు పంట వండటం, కంద పంట తవ్వటం పనులు చేస్తున్న తరుణంలో వర్షం హఠత్తుగా రావటంతో రైతులు హడావుడిగా పరదాలు కప్పారు. కొంతమంది రైతులు అలాగే వదిలి వేశారు. ఏదిఏమైనా ఈ అకాల వర్షం రైతులు పండించిన పంటకు కొంత నష్టం చేకుర్చవచ్చు.