కృష్ణ

విషపు నీటిని తాగి తొమ్మిది ఆవులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైకలూరు, మార్చి 21: విషగుళికలు కలిపిన నీటిని తాగి తొమ్మిది ఆవులు మృత్యువాత పడిన సంఘటన మండల పరిధిలోని పందిరిపల్లిగూడెంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ చేపల చెరువు రైతు తన చెరువులో చైనా గురుక చేపలను నివారించేందుకు గాను మంగళవారం విషగుళికలు చల్లాడు. బుధవారం అదే గ్రామానికి చెందిన పలువురి ఆవులు మేతకు వెళ్లి ఆ చెరువులోని నీటిని తాగాయి. నీటిని తాగిన కొంత సేపటికే ఆవుల పొట్టలు ఉబ్బి అస్వస్థతకు గురయ్యాయి. దీన్ని గమనించిన స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. తహశీల్దార్ శ్రీను నాయక్, ఆర్‌ఐ వెంకటరెడ్డి, వీఆర్‌ఓ బసవరత్నం, పశు వైద్యాధికారులు వెళ్లి పరిస్థితి పరీక్షించారు. వివిధ చోట్ల ఆవులు అప్పటికే మృతి చెంది ఉన్నాయి. మరికొన్ని అస్వస్థతకు గురి అవ్వగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన చేశారు. జనసేన నాయకుడు కొల్లి బాబి తదితరులు కావాలనే కుట్రపూరితంగా ఆవులపై విషప్రయోగం చేశారని, దీనిపై సమగ్ర విచారణ నిర్వహించి సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ముక్త్యాల లిఫ్ట్‌తో చివరి భూములకూ సాగునీరు
అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే రాజగోపాల్
జగ్గయ్యపేట, మార్చి 21: రాష్ట్ర విభజన తరువాత సాగర్ ఎడమ కాలువ నుండి సక్రమంగా నీరు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముక్త్యాల వద్ద లిఫ్ట్ నిర్మాణం చేస్తే కాలువ చివరి భూముల వరకూ నీరు అందించే అవకాశం ఏర్పడుతుందని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ అసెంబ్లీలో ప్రస్థావించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే రాజగోపాల్ మాట్లాడుతూ లెఫ్ట్ కెనాల్ ద్వారా నియోజకవర్గ సాగునీటి సరఫరా కోసం 12టిఎంసీల నీరు విడుదల చేయాలని, అది ప్రస్తుతం తెలంగాణాలో లిఫ్ట్‌లు మరియు మోటార్ల ద్వారా నీటిని వినియోగించుకోవడంతో ఆంధ్రా ప్రాంత రైతులకు సాగునీరు రావడం లేదని, అదీ కాక సాగర్ నుండి 170 కిలో మీటర్లు ప్రయాణించి ఆంధ్రాకు రావాల్సి ఉంటుందని, జగ్గయ్యపేట సమీపంలోని ముక్త్యాల వద్ద లిఫ్ట్ నిర్మిస్తే ప్రతి ఎకరాకు సాగునీరు అందించవచ్చని తెలిపారు. పులిచింతలకు అతీ సమీపంలో 6కెఎం దూరంలో ఈ లిఫ్ట్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం సశ్యశ్యామలం అవుతుందని వివరించారు. దీనిపై జలవనరుల శాఖ మంత్రి డీపీఆర్‌ను తయారు చేసి ఎక్స్‌పర్ట్ కమిటీ పరిశీలనలో ఉందని వివరించారు. ఈ ప్రాజెక్టు పరిశీలిస్తున్నట్లు మంత్రి వివరించారు. అలాగే అసెంబ్లీ జిరో అవర్‌లో పురపాలక శాఖ అస్తి పన్నులు, కుళాయి పన్నులపై సకాలంలో చెల్లించని వినియోగదారులకు భారీగా పెనాల్టీలు విధిస్తున్నారని, అసలు పనే్న కట్టలేని పేదలకు పెనాల్టీ మరింత భారం అవుతుందని, పురపాలకాల్లో పెనాల్టీలు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

హోదా ఇచ్చే వరకూ పోరు
మైలవరం, మార్చి 21: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే వరకూ పోరు ఆగదని పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ బుధవారం మైలవరంలోని పలు స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులు, కళాకారులతో కలిసి ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక బోసుబొమ్మ సెంటరులో మానవహారం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కన్నారు. అడ్డగోలు రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్ర రాష్ట్రం తీరని అన్యాయానికి గురైందన్నారు. విభజన సమయంలో పార్లమెంటులో ఆమోదించబడిన అంశాలను తప్పని సరిగా అమలు చేయాల్సిందేనన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు విశాఖ రైల్యే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ వంటి అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై నేతలు మండి పడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కులు సాధించే వరకూ విశ్రమించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి హంసావత్ భోజ్యనాయక్, అభయ, యువ షెడ్యూల్ తెగల సంక్షేమ సంఘం అధ్యక్షులు అన్నపరెడ్డి జమలయ్య, స్టార్ సంస్థ అధ్యక్షులు బి దాసు, అంబేద్కర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు బుర్రి ప్రతాప్, పలు సంస్థల ప్రతినిధులు, పుర ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు.

విద్యుత్ టవర్ లైన్లు ఏర్పాటు చేయొద్దు
గన్నవరం, మార్చి 21: విద్యుత్ టవర్ లైన్లు ఏర్పాటు వల్ల తమ భూములకు విలువ లేకుండా పోతోందని, ప్రస్తుతం ఉన్న వాటితోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ముస్తాబాద్ పంచాయతీ కార్యాలయం వద్ద వెదులుపావులూరు రైతులు సమావేశమయ్యారు. నున్న పవర్ గ్రిడ్ నుండి గన్నవరం సబ్ స్టేషన్ వరకు 132 కే.వీ విద్యుత్ లైన్ నిర్మాణానికి ఏపీ ట్రాన్స్‌కో అధికారులు చర్యలు చేపట్టారు. నున్న నుండి రామచంద్రపురం, వెదురుపావులూరు, కొండపావులూరు, బీబీగూడెం గ్రామాల మీదుగా గన్నవరం వస్తుంది. ఆయా గ్రామానికి చెందిన పంట పొలాల్లో నుండి టవర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు విద్యుత్ శాఖ ఏఈలు సర్వే చేపట్టారు. టవర్ లైన్లు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదన్నారు. ఇప్పటికే ఒక్కొక్క రైతు పొలం నుండి 2, 3 టవర్ లైన్లు ఉన్నాయని, మళ్లీ కొత్తగా నిర్మిస్తే తాము ఎలా బతకాలని అధికార్లను ప్రశ్నించారు. ఉన్న పొలాలు ఔటర్ రోడ్డు, హైవే, బైపాస్ నిర్మాణాలకు ప్రభుత్వం తీసుకుందన్నారు. టవర్ లైన్లు నిర్మిస్తే రైతులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఏర్పడుతుందన్నారు. అధికారులు పునరాలోచన చేయాలని సూచించారు. టవర్ లైన్లు హైవే రోడ్డు, పోలవరం వద్ద కట్ట మీదుగా నిర్మించాలని కోరారు. తోట నాగేశ్వరరావు, గుంటక బసివిరెడ్డి, శ్రీనివాసరావు, బాబూరావు, నాగేశ్వరరెడ్డి, సత్యనారాయణలు మాట్లాడారు. ఏఈలు కిషోర్, జగదీష్‌ల వద్ద తమ గోడు విన్నవించుకున్నారు.