కృష్ణ

తిరుపతమ్మ చిన్న తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుగంచిప్రోలు, మార్చి 21: ఈ నెల 23 నుండి ప్రారంభం కానున్న శ్రీ తిరుపతమ్మ అమవారి చిన్న తిరునాళ్ల మహోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయినట్లు కార్యనిర్వహణ అధికారి రఘునాధ్ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ నుండి 27వ తేదీ వరకూ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ల మహోత్సవాలు జరుగుతాయని, దీనిలో భాగంగా 23న ఉదయం 5 గంటలకు అఖండ జ్యోతి స్థాపనతో తిరునాళ్ల మహోత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు. 24వ తేదీ గ్రామంలో రథోధోత్సవం, 25న పసుపు కుంకుమ పూజ నిర్వహిస్తామన్నారు. ఈ పూజలో పాల్గొనే భక్తులకు దేవస్థానం వారే పూజా సామాగ్రి అందజేస్తారని అన్నారు. 26న తిరునాళ్లలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమ్మవారి పుట్టింటి పసుపు కుంకుమ సమర్పణ జరుగుతుందన్నారు. దీనికి సంబంధించి అనిగండ్లపాడు గ్రామస్థులతో ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి పసుపు కుంకుమ బండ్లు త్వరిగతిన ఆలయం వద్దకు చేరుకునే విధంగా సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. 27న ఆసియా ఖండంలోనే అత్యంత ఎతె్తైన 90 అడుగుల ఇనుప ప్రభోత్సవం జరుగుతుందని తెలిపారు. తిరునాళ్లకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక టాయిలెట్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మునే్నటిలో నీటి ఎద్దడి కారణంగా 350 జల్లు స్నానాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు మంచినీటి సమస్య ఏర్పడకుండా నాలుగు చలివేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈ చలివేంద్రాల ద్వారా మంచినీటి ప్యాకెట్లు అందజేస్తామన్నారు. మరో వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తిరునాళ్ల సందర్భంగా ఆలయం వద్ద శానిటేషన్ పనులు దేవస్థానం నిర్వహిస్తుండగా గ్రామంలో పంచాయతీ వారి పర్యవేక్షణలో శానిటేషన్ పనులు జరుగుతాయన్నారు. మహోత్సవాలకు వచ్చే సిబ్బందికి ప్రత్యేక వసతులు కల్పించినట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు తిరునాళ్ల మహోత్సవాల్లో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.