కృష్ణ

ఉద్యమ స్ఫూర్తి చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, ఏప్రిల్ 10: ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన బిసి రిజర్వేషన్ హామీ అమలు కోసమే రోడ్డెక్కామని, ఈ ఉద్యమానికి చంద్రబాబే స్ఫూర్తి ప్రదాత అని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. ఉద్యమాన్ని నీరుగార్చే క్రమంలో అనేక ఆటంకాలు, అడ్డంకులను సృష్టించి మా జాతి మధ్య విభేదాలను ఏర్పరచినట్లు ఆయన విమర్శించారు. ఇచ్చిన సమయంలోగా రిజర్వేషన్లు కల్పించని పక్షంలో మరోసారి ఉద్యమానికి వెనకాడమన్నారు. అదివారం నగరంలోని ఐవి ప్యాలెస్‌లో అమరావతి కాపు అత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముద్రగడ మాట్లాడుతూ ఉద్యమాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారని ఎన్నో ఏళ్లుగా కాపు కులానికి అన్యాయం జరుగుతూనే ఉందని, చంద్రబాబు హామీ ఇచ్చినందున ఆయనకు కాపు జాతి మొత్తం మద్దతు తెలిపిందన్నారు. స్వతంత్య్రం సిద్ధించిన నాటి నుండి అగ్రకులాలు రాష్ట్రాన్ని పాలిస్తూ కాపుకులస్థులకు అన్యాయం చేస్తూనే ఉన్నారని చెప్పారు. తుని సభకు అశేషంగా జిల్లా నుండి తరలి వచ్చి మద్దతు తెలిపిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు జిల్లా కాపునేతలు మాట్లాడుతూ ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన విజయవాడ నుండే గతంలో కాపు ఉద్యమం ప్రారంభమైందని గుర్తు చేశారు. కాపులను కేవలం ఎన్నికల సమయంలో వినియోగించుకుంటున్న పార్టీలు కూరలో కరివేపాకులా వాడి వదిలేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాపు ఉద్యమం ఆకలి.. బతుకు పోరాటమన్నారు. 65ఏళ్లుగా కాపులకు రిజర్వేషన్లు లేని కారణంగా లక్షల ఉద్యోగాలు, కోట్ల రూపాయల రుణాలు పొందలేకపోయామన్నారు. బిసిలకు అన్యాయం చేసేలా రిజర్వేషన్లు అడగడం లేదని కేవలం కేటగిరీని మాత్రమే కోరుతున్నట్లు గుర్తు చేశారు. రిజర్వేషన్లు పొందేంత వరకు ప్రభుత్వాన్ని నిద్రపొనివ్వం.. మేము నిద్రపోము అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఉద్యమాన్ని విమర్శిస్తున్న నేతలు ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. కాపుల అండదండలు లేని ప్రభుత్వాలు మనుగడ సాధించలేవని హెచ్చరించారు. ఇప్పటికే తుని ఘటనతో మా శక్తిని తెలుసుకున్న ప్రభుత్వ ఇప్పటికైనా పూర్తి న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లేని పక్షంలో మరోసారి ఉద్యమం చేయడానికి వెనకడుగు వేయమన్నారు. జిల్లా కాపు నేత పిచ్చయ్యనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాపు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిసి కమిషన్‌కు నివేదకను అందించేందుకు గాను రూపొందించిన సర్వే నమూనాను ముద్రగడ అవిష్కరించారు. అంతకు ముందు వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.