కృష్ణ

రాష్ట్రంలో దశలవారీగా పేదలకు పక్కా ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, అక్టోబర్ 27: రాష్ట్రంలో దశలవారీగా పేదలందరికీ ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని అమలు జరిపి అందికీ పక్కా ఇళ్లు నిర్మిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్, టిడిపి పామర్రు నియోజకవర్గ ఇన్‌చార్జి వర్ల రామయ్య అన్నారు. పామర్రు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి ఎంపికైన తొలివిడత 290 మందిలో 112 మందికి గృహ మంజూరు పత్రాలను ఆయన మంజూరు చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నాణ్యత కలిగిన ఇళ్లను రూ.లక్షా 50వేలతో నిర్మించుకునేలా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10లక్షల మందికి ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని అమలు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. తమ ప్రభుత్వ ఆశయం మేరకు ప్రతి పేదవాడికి కూడు, గూడు, గుడ్డ ఏర్పాటు చేయటమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. కిలో రూపాయి బియ్యం పథకం, తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ, ఎన్టీఆర్ వైద్యసేవ, తదితర పథకాలను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందని రామయ్య వివరించారు. ఎంపిడివో జె రామనాథం, ఎంపిపి దగ్గుపాటి ఉషా, జెడ్పీటిసి పొట్లూరి శశి, మార్కెట్ యార్డు ఛైర్మన్ మండపాక శంకరబాబు, పార్టీ మండల శాఖ అధ్యక్షులు కుదరవల్లి ప్రవీణ్, జిల్లా బిసి సంఘ నేత దాలిపర్తి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
పేటలో గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
జగ్గయ్యపేట, అక్టోబర్ 27: పట్టణంలో గురువారం తరలించేందుకు సిద్ధంగా ఉన్న సుమారు లక్షా 20వేల విలువైన గుట్కాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారికి అందిన సమాచారం మేరకు గుండా కాశయ్యకు చెందిన షాపు వద్ద ఆటోలోకి ఎక్కిస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. వీటి విలువ లక్షా 20వేలు ఉంటుందని తెలిపారు. అలానే పట్టణంలోని పాత చౌత్రం వద్ద సిహెచ్ రామారావుకు చెందిన కిరాణా షాపులో సుమారు 12వేల విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. సిఐ లచ్చునాయుడు వీటిని పరిశీలించారు.
జిల్లా కబాడీ పోటీల్లో ఎస్వీఎల్ విద్యార్థుల ప్రతిభ
అవనిగడ్డ, అక్టోబర్ 27: స్థానిక ఎస్వీఎల్ క్రాంతి కళాశాలకు చెందిన బాలికల కబాడీ జట్టు జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల్లో ద్వితీయ స్థానం కైవసం చేసుకుంది. విజయవాడ సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో జిల్లా జూనియర్ కళాశాలల ఛాంపియన్స్ ఆటల పోటీల్లో ద్వితీయ స్థానం కైవసం చేసుకున్న విద్యార్థులను కరస్పాండెంట్ ఉమామహేశ్వరరావు, గాజుల శ్రీనివాసరావు అభినందించారు.
ఎమ్మార్పీఎస్ జిల్లా
ఉపాధ్యక్షునిగా నోవా
మైలవరం, అక్టోబర్ 27: ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షునిగా జి కొండూరు మండలం వెల్లటూరుకు చెందిన మందా నోవా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్యమాదిగ నుండి ఉత్తర్వులు అందినట్లు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తనను జిల్లా ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ఎమ్మార్పీఎస్ పశ్చిమ కృష్ణా కన్వీనర్ మోదుగు నానికి, సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మార్పీఎస్ వర్గీకరణకు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నిర్వహించే పోరాటంలో ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తానన్నారు. వర్గీకరణకు చట్టబద్ధత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. మాదిగ, మాదిగ ఉప కులాలకు న్యాయం కోసం నిరంతరం కృషి చేస్తానని నోవా వివరించారు.