కృష్ణ

విద్యుత్ అగ్గిరవ్వలకు 5 ఇళ్లు బుగ్గి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, అక్టోబర్ 27: మండలంలోని దేవరపల్లి శివారు పొట్టిదిబ్బలంకలో గురువారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో ఐదు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. గృహస్థులు పొలం పనుల్లో నిమగ్నమైన సమయంలో విద్యుత్ తీగల నుంచి నిప్పురవ్వలు పడి మంటలు చెలరేగి ఇళ్లను బుగ్గిచేయటంతో బాధితులు కట్టుబట్టలతో మాత్రమే మిగిలి నిరాశ్రయులయ్యారు. విశ్వనాథపల్లి శ్రీనివాసరావు ఇంటి పైగా ఉన్న విద్యుత్ లైన్ నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో నిప్పురవ్వలు చెలరేగాయి. గాలులకు పక్కనే ఉన్న లంకే హనుమంతరావు, నడకుదురు సామ్రాజ్యం, కైతేపల్లి లక్ష్మి, గుదిబండి సాంబిరెడ్డి ఇళ్లను మంటలు చుట్టుముట్టాయి. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో పెద్దవారంతా పొలం పనుల్లో ఉండటంతో ఇళ్లల్లోని వస్తువులను బయటకు తీయలేకపోయారు. మంటలను చూసి పరుగెత్తుకు వచ్చేలోపే ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. నగలు, డబ్బు, ఇతర విలువైన సామగ్రి మొత్తం కాలిబూడిదయ్యాయి. కృష్ణా నదీపాయలో నీరు ఉండటంతో ఫైర్ ఇంజన్ కూడా వచ్చే అవకాశం లేక ఎవరూ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం కూడా ఇవ్వలేదు. ఆర్‌ఐ ఎ సునీత, ఇన్‌చార్జి విఆర్వో నాగేశ్వరరావు పొట్టిదిబ్బలంక వచ్చి బాధిత కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు. మొత్తం రూ.5లక్షల నష్టం జరిగిందని ఆర్‌ఐ సునీత తెలిపారు.
వరిగడ్డి దగ్ధం
మండలంలోని భద్రిరాజుపాలెంలో గురువారం పి ఎలీషాకు చెందిన నాలుగు ఎకరాల గడ్డివామి దగ్ధమైంది. పిల్లలు టపాసులు కాల్చటంతో ఈ ప్రమాదం జరిగిందని చెపుతున్నారు, ఉయ్యూరు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.