కృష్ణ

మానవ జీవన విధానమే ఆయుర్వేదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయ్యూరు, అక్టోబర్ 28: ఆయుర్వేదాన్ని వైద్య శాస్త్రం అనడం కన్నా మానవ జీవన విధానం అనడం మేలని విజయవాడ ఆయుర్వేద కళాశాల శల్యతంత్ర ప్రొఫెసర్ చదలవాడ వెంకట కోటేశ్వరరావు అన్నారు. యూనివర్శల్ సొసైటీ ఫర్ ఆయుర్వేద, భారతీయ జనతా పార్టీ ఉయ్యూరు పట్టణ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జయంతి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ మిగిలిన వైద్య శాస్త్రాలు రోగం వచ్చాక వాటిని నివారించేందుకు మందులిస్తే ఆయుర్వేదం రోగం రాకుండా తీసుకోవలసిన చర్యలు చెబుతుందన్నారు. మానవ జీవనానికి ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యం మూల స్తంభాలని, వీటిని క్రమశిక్షణతో నియమానుసారం అనుసరిస్తే రోగాల బారిన పడరని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తున్న షుగర్, బి.పి, ఎయిడ్స్ వంటి వ్యాధుల బారిన పడకుండా శాస్ర్తియమైన జీవన విధానాన్ని అనుసరించాలని తెలిపారు. యోగాచార్య దావులూరి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ క్షీర సాగర మథనంలో ఉద్భవించిన ధన్వంతరి, లక్ష్మీదేవిలో మనం లక్ష్మీదేవిని కొలుస్తూ, ధన్వంతరిని నిర్లక్ష్యం చేస్తున్నామని, అందుకే రకరకాల రోగాల బారిన పడుతున్నామన్నారు. యోగ - ఆయుర్వేదం సమాజమనే బండికి రెండెడ్ళ వంటివని తెలిపారు. బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా కో ఆర్డినేటర్ బాలాజీ మాట్లాడుతూ సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్య విధానం ఆయుర్వేదమన్నారు. సభకు అధ్యక్షత వహించిన యూనివర్శల్ సొసైటీ ఫర్ ఆయుర్వేద చైర్మన్, పట్టణ బిజెపి అధ్యక్షుడు డాక్టర్ దివి చిన్మయ మాట్లాడుతూ పత్యం, వేడి చేయడం వంటి అపోహలతో ఆయుర్వేదాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామన్నారు. బిపి ఉంటే ఉప్పు తగ్గించాలని, షుగర్ ఉంటే చక్కెర తగ్గించాలని చెప్పే ఇతర వైద్యశాస్త్రాలు అవి పత్యాల కింద భావించడం లేదని అన్నారు. ప్రపంచానికి గురు స్థానంలో ఉన్న భారతదేశ వైద్య శాస్త్రాన్ని పాశ్చాత్య దేశాలు అనుసరిస్తుంటే మనం చిన్నచూపు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పట్టణాలకే పరిమితమై రోగులకు విష పూరితమైన మందులిచ్చి ఇతర వ్యాధులకు గురి చేసిన ఇతర వైద్య శాస్త్రాలు, ప్రస్తుతం పల్లెలకూ వ్యాపించడం దౌర్భాగ్యమన్నారు. ఈ సభలో ఉయ్యూరు పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ ఎం.కె.బాబు తదితరులు ప్రసంగించారు. బిజెపి పార్టీ రూరల్ శాఖ అధ్యక్షుడు వల్లూరు పల్లి మురళీకృష్ణ, పట్టణ పార్టీ ఉపాధ్యక్షుడు కళ్ళం శేషిరెడ్డి, కార్యదర్శి ఆదిరాజు సర్వేశ్వరరావు, పలువురు ఆయుర్వేద వైద్యులు పాల్గొన్నారు. అంతకు ముందు ధన్వంతరి చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా సీనియర్ ఆయుర్వేద వైద్యులను ఘనంగా సత్కరించారు.