కృష్ణ

సాగర తీరానికి కార్తీక శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 14: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగినపూడి సాగర తీరం ఆధ్యాత్మిక శోభను సంతరింప చేసుకుంది. పవిత్ర పుణ్య స్నానాలు చేసేందుకు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు సోమవారం మంగినపూడి సముద్ర తీరానికి తరలి వచ్చారు. సకుటుంబ సమేతంగా సముద్రపు ఒడ్డున కార్తీక దీపారాధనలు చేసి పుణ్య స్నానాలు ఆచరించారు. తారతమ్య భేదాలు మరచి అన్ని వర్గాల ప్రజలు సముద్ర స్నానాలు ఆచరించడం విశేషం. సుమారు రెండు లక్షల మంది పైబడి భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్టు సమాచారం. వేకువ జామున మహిళలు చేసిన కార్తీక దీపారాధన వెలుగుల్లో సాగర తీరం అత్యంత ప్రకాశవంతమైంది. అదే సమయంలో సుందరమైన సూర్యోదయ దృశ్యాన్ని చూసిన భక్తులు పరవశించారు. సూర్య నమస్కారాలు చేసుకుని భక్తితన్మయత్వం పొందారు. అశేష భక్త వాహినితో సాగరుడు సైతం పులకించాడు. ఆదివారం రాత్రి చిలకలపూడి పాండురంగడిని దర్శించుకున్న భక్తులు అర్ధరాత్రికే మంగినపూడి బీచ్‌కు చేరుకున్నారు. సోమవారం తెల్లవారు జామున 5గంటలకు రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బీచ్ ఒడ్డున నెలకొల్పిన భారీ శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూర్ణిమ జ్యోతి ప్రజ్వలనతో సముద్ర స్నానాలను ప్రారంభించారు. భక్తులతో కలిసి మంత్రి రవీంద్ర పుణ్య స్నానాలు ఆచరించారు. అధికారులు చేపట్టిన ఏర్పాట్లను భక్తులను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం 4గంటల నుండి నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. వేద పండితులు విష్ణ్భుట్ల సూర్యనారాయణ శర్మ బ్రహ్మత్వంలో మంత్రి కొల్లు రవీంద్ర అమృత పాశుపత రుద్ర హోమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాగరుడికి హారతి ఇచ్చి సముద్ర స్నానాలకు ముగింపు పలికారు. అనంతరం నిర్వహించిన క్రాకర్ షో (బాణా సంచా కాల్పులు) కళ్ళు మిరిమిట్లు గొలిపింది. ఉదయం నుండి సాయంత్రం వరకు మంగినపూడి బీచ్‌కి భక్తుల తాకిడి ఏ మాత్రం తగ్గలేదు. పుణ్య స్నానాలు అనంతరం భక్తులు సమీపంలోని దత్తరామేశ్వర క్షేత్రంలోని ద్వాదశ తీర్ధాలతో పునీతులయ్యారు. నగరేశ్వర స్వామికి, దత్తేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. బందరు ఆర్డీవో సాయిబాబు, ఎంపిడివో జివి సూర్యనారాయణ పర్యవేక్షణలో బీచ్ వద్ద విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా బందరు డియస్‌పి శ్రావణ్ కుమార్ నేతృత్వంలో వన్ వే రూట్ ద్వారా వాహనాల రాకపోకలు సాగాయి. తాళ్ళపాలెం బడ్డీల సెంటరు నుండి గిరిపురం మీదుగా లైట్ హౌస్ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పించారు. అలాగే బీచ్ ముఖ ద్వారం నుండి వృద్ధులు, వికలాంగుల కోసం తాళ్ళపాలెం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నాలుగు ఉచిత ఆటో సర్వీసులు నిర్వహించారు. డియల్‌పిఓ సత్యనారాయణ నేతృత్వంలో బందరు డివిజన్‌లోని వందలాది మంది పారిశుద్ధ్య కార్మికులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. బీచ్ ఒడ్డున ఏ మాత్రం అపరిశుభ్ర వాతావరణం లేకుండా క్లీన్ అండ్ గ్రీన్ చేశారు. తాలుకా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అల్లు నవీన్ నరసింహ మూర్తి ఆధ్వర్యంలో బీచ్ వద్ద భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో బీచ్ లోపల బోట్లు, గజ ఈతగాళ్ళను నియమించి ప్రమాదాలు జరగకుండా చూశారు.