కృష్ణ

నగదు రహిత ఆర్థిక లావాదేవీలకు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 18: నగదు రహిత ఆర్థిక లావాదేవీల నిర్వహణకు వ్యాపారులు సహకరించాలని బందరు ఆర్డీవో సాయిబాబు కోరారు. స్థానిక శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నగదు రహిత వ్యాపారంపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో డివిజన్ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, ఎంపిడివోలతో పాటు వర్తక, వాణిజ్య సంస్థల ప్రతినిధులు, పలు బ్యాంక్‌ల మేనేజర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క వ్యాపారి విధి బ్యాంక్‌లు అందించే పోస్ మిషన్‌ను తీసుకోవాలన్నారు. పెద్ద నోట్లను కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నగదు రహిత ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించిందన్నారు. ఈ మేరకు బ్యాంక్‌ల నుండి పోస్ మిషన్‌లను వ్యాపారులకు ఉచితంగా అందచేయడం జరుగుతుందన్నారు. బ్యాంక్ ఎకౌంట్ ఉన్న వారికి ఆ బ్యాంక్ ద్వారా పోస్ మిషన్‌ను ఉచితంగా తీసుకోవాలన్నారు. గతంలో ఉన్న ఇన్‌స్టాలేషన్ ఛార్జీలను కూడా ప్రస్తుతం రద్దు చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని వ్యాపారులు సద్వినియోగం చేసుకుని నగదు రహిత ఆర్థిక లావాదేవీలకు సహకరించాలని కోరారు. కొంత మంది వ్యాపారులు నగదు రహిత ఆర్థిక లావాదేవీల సమయంలో వినియోగదారుడిపై పడే 1.65పైసలు సర్వీస్ టాక్స్‌ను రద్దు చేయాలని కోరారు. అయితే ఈ టాక్స్ బ్యాంక్‌లకు రాదని, నేరుగా వీసా సంస్థకు చేరుతుందని పలువురు బ్యాంక్ మేనేజర్లు తెలిపారు. ఈ సమావేశంలో బందరు తహశీల్దార్ నారదముని, పలు బ్యాంక్‌ల మేనేజర్లు పాల్గొన్నారు.