కృష్ణ

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 18: నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సమర్ధత కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన పట్ల ప్రజల్లో కనిపిస్తున్న ఆదరణ మరువలేనిదన్నారు. గడిచిన రెండున్నర ఏళ్ళుగా తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకే పార్టీ పరంగా జన చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బందరు మండలం పెదపట్నం, కానూరు, తాళ్ళపాలెం, గోకవరం, సిరివేళ్ళపాలెం గ్రామాల్లో శుక్రవారం ఆయన జన చైతన్య యాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ఇంటింటికి వెళ్ళి ప్రజలను నేరుగా కలిసి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు. అలాగే ఆయా గ్రామాల్లో రూ.5కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. కానూరు దళితవాడలో రూ.87లక్షలతో నిర్మించిన పెదపట్నం ఆర్‌అండ్‌బి రహదారి నుండి సిరంగిపాలెం వరకు అప్రోచ్ రోడ్డును ప్రారంభించారు. పెదకానూరులో రూ.90లక్షలతో తుఫాన్ షెల్టర్ పనులకు శంఖుస్థాపన చేశారు. రూ.36.50లక్షలతో జెడ్పీ హైస్కూల్‌లో అదనపు వసతుల భవనం, తరగతి గదులతో పాటు పలు రహదారులు, అంగన్‌వాడీ భవనాలను ప్రారంభించారు. పెదపట్నం గ్రామంలో రూ.88.60లక్షలతో తుఫాన్ షెల్టర్ భవన ప్రారంభోత్సవం, పెదపట్నం కొత్తూరులో రూ.35 లక్షలతో జాతీయ విపత్తు నివారణ పథకం కింద తుఫాన్ షెల్టర్‌కు అప్రోచ్ రోడ్డు ప్రారంభం, రూ.14లక్షలతో గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవం, రూ.6.60లక్షలతో రెండు సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. తాళ్ళపాలెంలో రూ.38.70లక్షలతో ఆరు సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన, రూ.10లక్షలతో సిరివేళ్ళపాలెం, గోకవరం గ్రామాల్లో రెండు సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ గడిచిన రెండున్నరేళ్ళల్లో బందరు నియోజకవర్గంలో వెయ్యి కోట్ల మేర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక లోటును అధిగమిస్తూ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రూ.200ల పెన్షన్‌ను వెయ్యి రూపాయలకు పెంచి పెన్షన్‌దారులకు భరోసా కల్పించిన ఘనత తమకే దక్కుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సైతం లెక్క చేయకుండా వేలాది కోట్ల రూపాయలు రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేసినట్లు చెప్పారు. బందరు నియోజకవర్గంలో మొదటి విడతగా 600 గృహాలు మంజూరైనట్లు తెలిపారు. త్వరలోనే అర్హులందరికీ పక్కా గృహాలు నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ జగన్నాధరావు (బుల్లయ్య), ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, ఎఎంసి చైర్మన్ మోకా భాస్కరరావు, టిడిపి మండల అధ్యక్షులు తలారి సోమశేఖర్, పార్టీ నాయకులు కుంచే దుర్గా ప్రసాద్, వైస్ ఎంపిపి ఊసా వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.