కృష్ణ

పులివెందులకూ సాగునీరు టిడిపి ఘనతే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, నవంబర్ 22: పట్టిసీమ ప్రాజెక్ట్ శుద్ధ దండగనీ, కమీషన్ల కోసమే నిర్మిస్తున్నారని ఆరోపణలు చేసిన వైసిపి నాయకులు దానిద్వారా వచ్చిన సాగునీటితోనే పంటలు పండించుకుంటున్నారని, పులివెందులకూ సాగునీరిచ్చి చీనీతోటలు కాపాడిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టీకరించారు. టిడిపి జనచైతన్య యాత్రల్లో భాగంగా మంగళవారం ఆయన మండలంలోని వెల్వడం, తోలుకోడు, గణపవరం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గత కాంగ్రెస్ పాలనలో ఎన్నడూ సాగునీరు ఇవ్వలేని నాయకులు ప్రజల సొమ్మును అక్రమంగా వేల కోట్ల రూపాయలు దోచుకుని జైలు జీవితం గడిపినా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అహర్నిశలూ రాష్ట్భ్రావృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబును, తనను విమర్శిస్తున్నారని పరోక్షంగా జగన్, వైసిపి నాయకులనుద్దేశించి విమర్శించారు. సంవత్సర కాలంలో ఒక మహా సంకల్పంతో గోదావరి తల్లిని కృష్ణమ్మలో కలిపి దేశంలోనే తొలిసారిగా నదులను అనుసంధానం చేసి చరిత్ర సృష్టించిన ఘనత తమకే దక్కిందని ఉమ అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మూడురోజులు అంతర్జాతీయ మహిళా పార్లమెంట్ సమావేశాలు, శిక్షణ తరగతులు ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర సంగమ ప్రదేశంలో జరగనున్నాయని తెలిపారు. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా దాదాపు 12వేల మంది మహిళా ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. జనవరి మూడో వారంలో అంతర్జాతీయ సంగీత విభావరి అదే ప్రాంతంలో ఐదురోజులు జరగనుందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలోనే జరగటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. 49.09 కోట్ల రూపాయలతో చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా పశ్చిమకృష్ణాకు శాశ్వతంగా తాగు, సాగునీరు అందించే బృహత్తర ప్రణాళికను ఏడాదిలోగా పూర్తిచేయటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో బహుళ అంతస్తులు నిర్మించుకుని నివాసముండే కొందరు వైసిపి నాయకులు గడపగడపకూ తిరిగి ముఖ్యమంత్రిని, తనను విమర్శించటమే పనిగా పెట్టుకున్నారని జోగి రమేష్‌ను ఉద్దేశించి మంత్రి విమర్శించారు. విమర్శించే అర్హత వారికి ఉందా? అని ప్రశ్నించారు. గడచిన రెండేళ్లలో ఎంతో అభివృద్ధి చేశామని, ఇంకా చేయాల్సింది ఎంతో ఉందన్నారు. ఇప్పటివరకూ చేసిన అభివృద్ధిని వివరిస్తూ చేయాల్సిన పనులను తెలుసుకునేందుకు జనచైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్లు మంత్రి ఉమ వివరించారు. ఈసందర్భంగా వైసిపికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలో చేరగా కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోమటి సుధాకర్, ఎంపిపి బి లక్ష్మి, జెడ్పీటిసి దొండపాటి రాము, ఎంపిటిసి బి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.