కృష్ణ

స్నేహితులే నిందితులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, డిసెంబర్ 1: బంగారం వ్యాపారి హత్య కేసులో మిస్టరీని పోలీసులు చేధించారు. బాకీ తీర్చడం లేదనే కోపంతో స్నేహితులే నమ్మకంగా తీసుకొచ్చి కత్తితో పొడిచి చంపిన వైనం వెలుగు చూసింది. ఎట్టకేలకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును త్వరగా ఛేదించిన సిఐ వెంకటరమణను, ఎస్‌ఐ డి రాజేష్‌ను, ఐడి పార్టీ సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. జి.కొండూరు పోలీసుస్టేషనులో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో నూజివీడు డిఎస్‌పి శ్రీనివాసరావు వివరాలు తెలిపారు. ఈ నెల 24న మండల పరిధిలోని వెలగలేరులో పోలవరం ప్రధాన కుడికాలువ ఎడమగట్టుపై గుర్తుతెలియని శవాన్ని గుర్తించి వీఆర్వో చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అదే రోజున విజయవాడ గవర్నర్‌పేటకుకు చెందిన ఆళ్ళ రాజేష్ (35)గా హతుడిని గుర్తించారు. రాజేష్‌ను కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. దీనిపై రాజేష్ స్నేహితులను, బంధువులను విచారించి, రాజేష్‌కు వచ్చిన ఫోన్‌కాల్స్ ఆధారంగా కేసులో పురోగతిని సాధించారు. రాజేష్ పాత బంగారాన్ని కరిగించి కమీషన్ తీసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని మిత్రుడు తోట రవీంద్ర, రాజేష్‌కు సుమారు రూ.25లక్షల వరకూ అప్పు ఇచ్చాడు. బకాయి తీర్చమని పలుసార్లు అడిగినా రాజేష్ నుంచి సరైన సమాధానం లభించలేదు. హతుడు రాజేష్‌పై ఖమ్మం, గుంటూరు జిల్లాలో పలు కేసులు ఉన్నాయి. దొంగ బంగారం కేసుల్లో కూడా రాజేష్ ముద్దాయిగా ఉన్నాడు. దీంతో రాజేష్‌ను ఆయా కేసులో పోలీసులు విచారణకు తీసుకెళ్ళేవారు. ఈక్రమంలో తన పేరును కూడా ఆయా కేసుల్లో ఇరికిస్తాడని భావించిన తోట రవీంద్ర, రాజేష్‌ను చంపడానికి పథకం వేశాడు. 23వ తేదీ రాత్రి సమయంలో హతుడు రాజేష్, తన స్నేహితులు రవీంద్ర, నరేష్‌లతో కలసి ద్విచక్ర వాహనంపై విజయవాడ నుంచి వెలగలేరు వచ్చారు. ఇక్కడ మద్యం సేవించి బహిర్భూమికి వెళ్ళాలని పోలవరం కాలువ గట్టుపైకి వెళ్ళారు. అక్కడ నరేష్, రాజేష్‌ను చేతులు వెనక్కి విరిచి పట్టుకోగా, రవీంద్ర కత్తితో రాజేష్ శరీరంపై పొడిచి చంపాడు. శవాన్ని అక్కడే వదిలేసి వారిద్దరూ వెళ్ళిపోయారు. బుధవారం రాత్రి జి.కొండూరులో నిందితులు తోట రవీంద్ర, కాకర్ల నరేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన మోటారు సైకిలును, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల మొబైల్ సిగ్నల్స్ బట్టి హత్య జరిగిన రోజు వెలగలేరు ప్రాంతంలో ఉన్నట్లు నిర్ధారించారు. వీరిని కోర్టులో హాజరు పర్చనున్నట్లు వివరించారు.