కృష్ణ

చేనేత సంఘాలకు ఆర్థిక పరిపుష్టి కల్పిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, డిసెంబర్ 4: చేనేత రంగాలకు ఆర్థిక పరిపుష్టి కల్పించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కప్పలదొడ్డి గ్రామంలో రూ.38.63లక్షలతో నిర్మించిన శ్రీదేవల మహర్షి వీవర్స్ కో-ఆపరేటీవ్ సొసైటీ కామన్ ఫెసిలిటీ భవనాన్ని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్‌తో కలిసి ఆదివారం మంత్రి రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత కాంగ్రెస్ పాలనలో చేనేత సంఘాలు నిర్వీర్యమయ్యాయన్నారు. జిల్లాలో మూడు కామన్ ఫెసిలిటీ సంఘాలకు గాను కోటి రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగం మీద ఆధారపడే వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ఆధునిక వస్త్రాల నుండి గట్టి పోటీ ఎదురవుతున్నప్పటికీ చేనేత రంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బలోపేతం చేస్తున్నారన్నారు. నూలుపై ఇస్తున్న 20శాతం సబ్సిడీలో 10శాతం నేరుగా కార్మికుల బ్యాంక్ ఎకౌంట్లలో జమ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో చేనేత రుణ మాఫీ కింద 24వేల మంది కార్మికులకు రూ.110కోట్లు మంజూరైనట్లు తెలిపారు. బ్యాంక్ ఎకౌంట్లు సరిగ్గా లేకపోవటంతో ఆ మొత్తాన్ని కార్మికుల ఎకౌంట్లలోకి జమ చేయడంలో కొంత జాప్యం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కాసగాని శ్రీనివాసరావు, జెడ్పీటిసి చిలుకోటి గోపాలకృష్ణ, పెడన మున్సిపల్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, కెడిసిసి బ్యాంక్ డైరెక్టర్ పేరిశెట్టి మధుసూదనరావు, ఆప్కో డైరెక్టర్ మునగాల నరసింహరావు, ఎంపిటిసి పేరిశెట్టి వెంకటేశ్వరమ్మ, సర్పంచ్ కట్టా మునేశ్వరరావు, చేనేత, జౌళిశాఖ సంయుక్త సంచాలకులు లక్ష్మణరావు, దేవల మహర్షి వీవర్స్ సొసైటీ అధ్యక్షులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.