కృష్ణ

క్రీడా కేంద్రంగా బందరును తీర్చిదిద్దుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 4: జిల్లా కేంద్రం మచిలీపట్నంను క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్టేడియాన్ని నిర్మించి మచిలీపట్నంకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురానున్నట్లు తెలిపారు. స్టేడియం నిర్మాణానికి రూ.2కోట్లు మంజూరైనట్లు తెలిపారు. స్టేడియం నిర్మాణానికి గుర్తించిన స్థానిక కుమ్మరిగూడెంలోని 22 ఎకరాల స్థలాన్ని ఆదివారం మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. ఎంతో మంది క్రీడాకారులకు పుట్టినిల్లు అయిన మచిలీపట్నం గత పాలకుల వైఫల్యం కారణంగా క్రీడా రంగంలో వెనుకబడిందన్నారు. ఈ ప్రాంత శాశ్వత అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. చిత్తశుద్ధితో పోర్టు నిర్మాణానికి కృషి చేస్తుంటే ప్రతిపక్షం రాజకీయాలు చేస్తూ అభివృద్ధికి అడ్డు తగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీ, నిబద్ధతతో మచిలీపట్నం అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఇందుకు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సాయిబాబు, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, కమిషనర్ జస్వంతరావు, తహశీల్దార్ నారదముని, కౌన్సిలర్లు నారగాని ఆంజనేయ ప్రసాద్, టిడిపి నాయకులు అక్కుమహంతి రాజా, కాసాని భాగ్యారావు తదితరులు పాల్గొన్నారు.