కృష్ణ

జిల్లాకు ‘కరవు’ సాయం రూ.5 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 4: గత యేడాది ఖరీఫ్ సీజన్‌లో కరవు కోరల్లో చిక్కుకుని పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ.5కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరైంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఎకౌంట్‌లో జమ చేసింది. త్వరలోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఇన్‌పుట్ సబ్సిడీని జమ చేయనున్నారు. గత యేడాది ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో 13 మండలాలను కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎ.కొండూరు, గంపలగూడెం, తిరువూరు, విస్సన్నపేట, గన్నవరం, వత్సవాయి, జగ్గయ్యపేట, బాపులపాడు, చందర్లపాడు, బంటుమిల్లి, కృత్తివెన్ను, నందివాడ, పెడన మండలాలు కరువు మండలాల జాబితాలో ఉన్నాయి. ఈ మండలాల పరిధిలో 3350 హెక్టార్లలో పంట నష్టం సంభవించింది. 7వేల 380 మంది రైతులను పంట నష్టపోయిన రైతులుగా జిల్లా వ్యవసాయ శాఖ గుర్తించింది. అలాగే గత ఏడాది ఏప్రిల్‌లో కురిసిన వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు కూడా ప్రభుత్వం నష్టపరిహారాన్ని విడుదల చేసింది. ఇబ్రహీంపట్నం, రెడ్డిగూడెం, విస్సన్నపేట, నూజివీడు, వత్సవాయి, చందర్లపాడు మండలాల్లో 277 హెక్టార్లలో వరి, మొక్కజొన్న పంట వడగండ్ల వానకు దెబ్బతింది. 920 మంది రైతులకు నష్టాల బారిన పడ్డారు. వీరికి రూ.37.37లక్షలు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరవ్వగా రూ.36.48లక్షలు రైతుల బ్యాంక్ ఎకౌంట్లలోకి జమ చేసినట్లు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు నరసింహరావు ఆదివారం ‘ఆంధ్రభూమి’ ప్రతినిధికి తెలిపారు.