కృష్ణ

ఎంతచేసినా వందశాతం ఫలితమేదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 5: నగదు కొరత తీర్చడానికి తాను ఎంత కృషి చేసినా వంద శాతం ఫలితాలు రాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో నగదు రహిత చెల్లింపులు, ఏటిఎంల దగ్గర నగదు లభ్యత, ఇ-పోస్ తరహా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టినా ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతూనే వున్నారని ఆయన సోమవారం రాత్రి తన కార్యాలయంలో బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో అన్నారు. దీనికి కారణాలు ఏమిటో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే నాలుగైదు రోజుల్లో ఈ ఇబ్బందులను అధిగమించాలని, దీనిపై ఇటు బ్యాంకర్లు, అటు అధికారులు యుద్ధప్రాతిపదికన పనిచేయాలని సూచించారు. అన్ని చౌకధరల దుకాణాల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్ల విధానాన్ని ప్రవేశపెట్టి పెద్దఎత్తున నగదు రహిత చెల్లింపుల ప్రక్రియను గ్రామస్థాయిలో ముమ్మరంగా కొనసాగించాలని చెప్పారు. ఈ నెల 8న ఉదయం ముఖ్యమంత్రుల కమిటీ సమావేశాన్ని కన్వీనర్ హోదాలో తాను హాజరవుతున్నట్టు తెలిపారు. అక్కడ ఈ సమస్యకు జాతీయ స్థాయిలో పరిష్కారాలు దొరకవచ్చనే ఆశాభావాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తపర్చారు.