కృష్ణ

బడి రుణం తీర్చుకునేందుకు ముందుకు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 5: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో వౌలిక వసతుల కల్పన, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని కలెక్టర్ బాబు.ఎ పిలుపునిచ్చారు. సర్వశిక్షాభియాన్ ప్రత్యేకంగా రూపొందించిన ‘బడి రుణం తీర్చుకుందాం’ పోస్టర్లు, బుక్‌లెట్‌ను సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి యేటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ స్టేట్, ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించి ఉన్నత స్థాయిలో ఉన్న పూర్వ విద్యార్థులు ఆ పాఠశాలల అభివృద్ధికి ముందుకు రావాలని కలెక్టర్ కోరారు. బడి రుణం తీర్చుకుందాంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేందుకు గాను ఈ నెల 8వతేదీ నుండి అవగాహనా ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కెడివిఎం వర ప్రసాద్ కలెక్టర్‌కు తెలిపారు.

కనులపండువగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని దివ్య కల్యాణం
మోపిదేవి, డిసెంబర్ 3: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహా కుంభాభిషేక పూర్వక షష్టి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామివారి దివ్య కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ఆలయ వేద పండితులు నౌడూరి విశ్వనాధ సుబ్రహ్మణ్య శర్మ బ్రహ్మత్వంలో ఈ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బద్దు పవన్ కుమార్ శర్మ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. యాజ్ఞీక బ్రహ్మ బొమ్మూరి ఫణికుమార్ శర్మ బ్రహ్మత్వంలో హోమ యజ్ఞం నిర్వహించారు. నాగ పుట్ట పూజ, నిత్య హోమం నిర్వహించారు. సాయంత్రం స్వామి వారికి చతుర్వేద పారాయణ, వేద పారాయణ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనగా ఆలయ సూపరింటెండెంట్ ఎ మధుసూదనరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. గుంటూరు జిల్లా మంగళగిరి బెటాలియన్ కమాండెండ్‌గా పని చేస్తున్న ఐపిఎస్ అధికారి గోపీనాధ్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ మధుసూదనరావు స్వామి వారి జ్ఞాపిక, ప్రసాదం అందజేశారు.