కృష్ణ

‘మడ’ పరిధిలో నిరభ్యంతర పత్రాల జారీ అధికారం ఆర్డీవోదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 5: బందరు ఓడరేవు, దాని అనుబంధ పరిశ్రమల స్థాపనకు స్వచ్చందంగా భూములు ఇచ్చిన రైతులకు నిరభ్యంతర పత్రాల జారీ చేసే అధికారాన్ని ఆర్డీవోకు బదలాయిస్తూ కలెక్టర్ బాబు.ఎ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయమై సోమవారం మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మడ) కార్యాలయంలో మడ వైస్ చైర్మన్ బి వేణుగోపాలరెడ్డి, ఆర్డీవో సాయిబాబులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మడ పరిధిలో ప్రభుత్వం ఓడరేవు, పారిశ్రామిక కారిడార్, మెగా టౌన్‌షిప్ ఏర్పాటు కోసం ప్రభుత్వం భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. భూసమీకరణలో ఇప్పటికే చాలా మంది రైతులు తమ భూములు ఇచ్చేందుకు గాను అంగీకార పత్రాలను అందజేశారన్నారు. అంగీకార పత్రాలు ఇచ్చిన రైతుల భూముల క్రయ, విక్రయాలు జరిగినా వాటికి రిజిస్ట్రేషన్‌లు జరిగేందుకు నిరభ్యంతర పత్రాల (ఎన్‌ఓసి) కోసం దరఖాస్తు చేసుకుంటున్నారన్నారు. ఈ పత్రాలు జారీ చేసే అధికారాన్ని ఆర్డీవోకు అప్పగిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అభ్యంతర పత్రాలు ఇచ్చిన రైతులకు జాప్యం లేకుండా ఎన్‌ఓసి సర్ట్ఫికేట్లు జారీ చేయాలని ఆర్డీవో సాయిబాబును ఆదేశించారు.

పైసల కోసం తప్పని పాట్లు
మైలవరం, డిసెంబర్ 5: పెద్దనోట్ల రద్దు ప్రకటన జరిగి దాదాపు 25 రోజులు గడుస్తున్నా ఇంత వరకూ నగదు సమస్యలు తీరలేదు. తీరే పరిస్థితి కనుచూపు మేరలో లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ గంటల తరబడి బ్యాంకుల వద్ద క్యూ లైన్లలో పడిగాపులు కాయాల్సి వస్తుందని వాపోతున్నారు. మైలవరంలో ఏడు ఏటీఎంలున్నాయి. పెద్దనోట్ల రద్దు పుణ్యమా అంటూ ఒక్క ఏటీఎం కూడా పని చేయటం లేదు. అదేమంటే నగదు లేదని చెబుతున్నారు. దీంతో డబ్బు కావాలంటే బ్యాంకులోనే తీసుకోవాలి. స్థానికంగా ఎనిమిది బ్యాంకులున్నా ప్రతి బ్యాంకులో కిలోమీటర్ల పొడవునా క్యూలు కనిపిస్తున్నాయి. డబ్బు కావాలంటే ఆరోజు పనులు పూర్తిగా మానుకుని క్యూలో నించోవాల్సిందే. గంటల తరబడి క్యూలో నించున్నా అక్కడ ఇచ్చేది రెండుమూడు వేల రూపాయల మాత్రమే. పైగా నెలలో మొదటి వారం కావటంతో ఉద్యోగుల బాధలు వర్ణనాతీతం. బ్యాంకులలో ఇచ్చినా రెండు వేల రూపాయల నోట్లు ఇస్తుండటంతో చిల్లర సమస్య మరో తలనెప్పిని తెచ్చి పెడుతున్నాయి. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల నల్లకుబేరులకు చిక్కుల మాటేమోగానీ సామాన్యుడి జీవనం కష్టతరమవుతోంది. డబ్బుండి కూడా అనుభవించలేని విచిత్ర పరిస్థితి నెలకొంటుంది. ఏ బ్యాంకులో చూసినా నో క్యాష్ బోర్డులో, బారులు దీరిన క్యూలో దర్శనమిస్తున్నాయి. ఈసమస్య పరిష్కారమయ్యే రోజు ఎప్పుడొస్తుందో అర్థం కావటం లేదని వాపోతున్నారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న సామాన్యుడి బతుకు ఈనోట్ల రద్దుతో మరింత దిగజారి పోతుందని చెబుతున్నారు.