కృష్ణ

సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వసంతోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి, డిసెంబర్ 6: మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మహాకుంభాభిషేక పూర్వక షష్ఠి కళ్యాణ మహోత్సవాలలో భాగంగా మంగళవారం స్వామివారి వసంతోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ సూపరింటెండెంటు ఎ మధుసూదనరావు పర్యవేక్షణలో వేద పండితులు నౌడూరి విశ్వనాధ సుబ్రహ్మణ్య శర్మ, అర్చకులు బద్దు పవన్‌కుమార్ శర్మ, ఫణిశర్మ తదితరులు వసంతోత్సవ పూజలు నిర్వహించారు. కొమ్మూరి ఫణికుమార్ శర్మ ఆధ్వర్యంలో పూర్ణాహుతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఉదయం 11గంటలు నుండి స్వామివారిని శేషవాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి 7గంటలు నుండి స్వామివారి ద్వాదశ ప్రదక్షణలు నిర్వహించారు. పవళింపు సేవను బద్దు బాలకృష్ణ శర్మ నిర్వహించారు.

రూపే కార్డుల పంపిణీ ప్రారంభం
కూచిపూడి, డిసెంబర్ 6: మొవ్వ మండలంలోని పెదపూడి, భట్లపెనుమర్రు ఆంధ్రాబ్యాంక్ శాఖలలోని ఖాతాదారులకు మంగళవారం రూపే కార్డులు పంపిణీ చేశారు. పెద్దనోట్ల రద్దు కారణంగా ఏర్పడిన సమస్యలను అధిగమించేందుకు రూపే కార్డులను వినియోగించుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్రాంచ్ పరిధిలోని వందలాది మంది ఖాతాదారులకు రూపే కార్డులు పంపిణీ చేయటం అభినందనీయమని ఎంపిడిఓ వై పిచ్చిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఇఓ బాణావత్ కోటేశ్వరరావు, ఎపిఎం రామ్మోహనరావు, ఎపిఓ సిహెచ్ ప్రధానరావు, బ్రాంచ్ మేనేజర్లు జి నాగేశ్వరరావు, దిట్టకవి రామానుజా చార్యులు, ఇఓ ఎడివిఎల్ ప్రసాద్, విఆర్‌ఓ కర్రా శ్యాంసుందర్, టిఎ ఆసీఫ్, రామకృష్ణ పాల్గొన్నారు.