కృష్ణ

చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 8: ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రజలు వెన్నుదన్నుగా నిలవాలని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. గురువారం మండల పరిధిలోని గరాలదిబ్బ గ్రామంలో రూ.70లక్షలతో నిర్మించిన అంతర్గత రహదారులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బందరు నియోజకవర్గంలో తీర ప్రాంత గ్రామాలను కలుపుతూ రహదారి నిర్మించనున్నట్లు తెలిపారు. బందరు పోర్టు వస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, మన పిల్లలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. తీర గ్రామాలను కలుపుతూ చక్కటి రహదారి బ్రిడ్జిని నిర్మించినట్లు తెలిపారు. గ్రామంలో రూ.2కోట్లకు పైగా నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డు ఛైర్మన్ గోపు సత్యనారాయణ, సర్పంచ్ శంకరరావు, మండల పార్టీ నాయకులు తలారి సోమశేఖర్, ఖాజా బేగ్, మోకా అప్పారావు, కౌన్సిలర్ బచ్చుల అనిల్ తదితరులు పాల్గొన్నారు.

అప్రమత్తంగా ఉండండి
* ‘వార్ధా’ పై తహశీల్దార్ హెచ్చరిక
మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 8: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫాన్‌గా మారే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ బి నారదముని ఆదేశించారు. గురువారం తహశీల్దార్ కార్యాలయంలో విఆర్‌ఓలతో ఆయన సమావేశం నిర్వహించారు. మచిలీపట్నం, నెల్లూరు మధ్య తుఫాన్ తీరం దాటే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పెనుగాలులు, అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని విఆర్‌ఓలను ఆదేశించారు. మత్స్యకారులను వేటకు వెళ్ళకుండా చూడాలన్నారు. వేటకు వెళ్ళిన వారికి సమాచారం ఇచ్చి వెంటనే వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలను తరలించేందుకు గాను తుఫాన్ షెల్టర్లు, పాఠశాల భవనాలను సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్‌ఐ శ్రీనివాస్, విఆర్‌ఓలు పాల్గొన్నారు.

వెయిట్ లిఫ్టింగ్‌లో బండారుకు మూడు పతకాలు
గుడివాడ, డిసెంబర్ 8: గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం వెయిట్ లిఫ్టర్ బండారు దుర్గా విష్ణువర్ధన్ ప్రసాద్ మూడు పతకాలు సాధించారు. గురువారం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సభలో బండారును స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి యలవర్తి శ్రీనివాసరావు అభినందించారు. అనంతరం యలవర్తి విలేఖర్లతో మాట్లాడుతూ నవంబర్ 28 నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్‌లో జరిగిన 14వ జూనియర్ పురుషుల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో బండారు మూడు విభాగాల్లో మొత్తం 265 కేజీల బరువు ఎత్తి మూడు వెండి పతకాలను సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పెనుమూడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.