కృష్ణ

హమ్మయ్య..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 13: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘వార్ధా’ తుపాన్ ముప్పు తప్పటంతో మూడు రోజుల పాటు ఉరుకులు పరుగులు తీసిన అధికార యంత్రాంగం మంగళవారం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో సముద్రుడి ఉధృతికి తీవ్ర భయాందోళనలకు గురైన తీర ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. చేతికంది వచ్చిన పంట ఎక్కడ సర్వనాశనం అవుతుందోనని ఆందోళన చెందిన రైతన్నలు సేదతీరారు. సోమవారం సాయంత్రం వార్ధా తుపాన్ చెన్నైకి సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో సోమవారం రాత్రి నుండి మంగళవారం ఉదయం 9గంటల వరకు తేలిక పాటి వర్షం కురిసింది. తీర ప్రాంత మండలాలైన మచిలీపట్నం, చల్లపల్లి, అవనిగడ్డ, నాగాయలంక, అవనిగడ్డ, మోపిదేవి, కోడూరు మండలాల్లో 15 నుండి 21 మి.మిల మేర వర్షపాతం నమోదైంది. జిల్లాలో సరాసరి వర్షపాతం 4.1మి.మిలు నమోదు అయ్యింది. అత్యధికంగా చల్లపల్లి మండలంలో 21.2మి.మిలు వర్షపాతం నమోదైంది. వర్షం కురిసిన ప్రాంతాల్లో కొద్ది మేర వరి పంట తడిచింది. గత మూడు రోజులుగా రైతులు పంట రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ అక్కడక్కడా పనల మీద ఉన్న పంట తడిచింది. అలాగే నిడివి మీద ఉన్న పంట వర్షం, గాలి ధాటికి నేలవాలిపోయింది. ఉదయం నుండి ముసురు వీడటంతో గట్టెక్కినట్టేనని రైతులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా మూడు రోజుల పాటు అటు అధికారులను, ఇటు రైతులను పరుగులెత్తించిన వార్ధా తుఫాన్ వెలవటంతో హమ్మయ్యా.. అంటూ ఊపిరిపీల్చుకున్నారు.

స్వర్ణ, కాంస్య పతకాల విజేతకు ఎస్పీ అభినందన
మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 13: విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన 36వ ఎపి అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్-2016 పోటీల్లో పాల్గొని స్వర్ణ, కాంస్య పతకాలు సాధించిన కెవిడివి కుమారిని మంగళవారం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జి విజయ్‌కుమార్ అభినందించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న కుమారి షాట్ పుట్, డిస్క్‌త్రో విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన స్వర్ణ పతకాలను, హేయర్ త్రోలో ద్వితీయ స్థానంలో నిలిచిన కాంస్య పతకాన్ని సాధించింది. ఆమెను మంగళవారం ఎస్పీ విజయ్‌కుమార్ అభినందించారు.