కృష్ణ

టిడిపి సభ్యత్వాల నమోదులో లక్ష్యాన్ని అధిగమిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 18: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాలన పట్ల ఆకర్షితులైన ప్రజలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు తీసుకుంటున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేర్కొన్నారు. స్థానిక ఆర్‌అండ్ అతిథి గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో లక్ష్యాన్ని అధిగమిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 6 లక్షల మేర సభ్యత్వాలు నమోదు అయినట్లు చెప్పారు. రానున్న రెండు రోజుల్లో నూరు శాతం లక్ష్యం పూర్తవుతుందన్నారు. ఇందులో 54 శాతం మంది కొత్తగా పార్టీ సభ్యత్వాలు తీసుకున్న వారు కావడం చంద్రబాబు పాలన పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుందన్నారు. సభ్యత్వాల నమోదులో సంఖ్యా పరంగా మైలవరం నియోజకవర్గం ప్రథమ స్థానం, పామర్రు నియోజకవర్గం ద్వితీయ స్థానం, నందిగామ నియోజకవర్గం తృతీయ స్థానంలో నిలిచాయన్నారు. శాతం వారీగా గుడివాడ, విజయవాడ వెస్ట్, జగ్గయ్యపేట నియోజకవర్గాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయని వివరించారు. లక్ష కోట్ల అక్రమాస్తుల కేసులో ముద్దాయిగా ఉన్న వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉండటం దురదృష్టమన్నారు. 2014వ సంవత్సరం నుండి అక్రమాస్తుల కేసులో జగన్‌కు చెందిన రూ.2524 కోట్లు స్థిరాస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, టిడిపి జిల్లా కార్యదర్శి పివి ఫణి కుమార్ పాల్గొన్నారు.